నేషనల్ హైవే అథారిటీ రోడ్లను స్వయంగా మరమ్మతు చేసే పద్ధతిని కనిపెట్టింది. ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు, త్వరలో మన భారతీయ రోడ్లపై ఈ సాంకేతికతను చూడవచ్చు. రోడ్లపై సెల్ఫ్ హీలింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు కొత్త రకం తారును ఉపయోగించనున్నట్లు నేషనల్ హైవే అథారిటీ తెలిపింది. ఈ విషయానికి సంబంధించిన ఒక సీనియర్ అధికారి మాట్లాడుతూ, ఈ సాంకేతికత రహదారిని నిర్మించేటప్పుడు మాత్రమే ఉపయోగించబడుతుందని చెప్పారు. ఇది రోడ్లలో గుంతలను నివారిస్తుందన్నారు. ముఖ్యంగా ఈ సాంకేతికత వినియోగంతో రోడ్లు త్వరగా చెడిపోవు. చిన్న పగుళ్లు వచ్చినా వాటంతట అవే నయమై పెద్ద గుంతలు ఏర్పడకుండా ఉంటుందని వివరించారు. ఈ సాంకేతికత వినియోగంతో రోడ్లు త్వరగా పాడవవని, మళ్లీ మళ్లీ మరమ్మతులకు అయ్యే ఖర్చు కూడా ఆదా అవుతుందని అధికారి చెబుతున్నారు. అంతేకాదు మరమ్మతుల సమయంలో ట్రాఫిక్ మళ్లింపు, ఆపేయటం వంటి అవసరం కూడా ఉండదని చెప్పారు. ఈ సాంకేతికత సాయంతో ఇలాంటి సమస్యలు ఏవీ ఉండవంటున్నారు.
0 Comments