పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ సీఏ ఆనంద బోస్‌పై ఎన్నికల సంఘానికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో గవర్నర్ బీజేపీకి ప్రచారం చేస్తున్నారని టీఎంసీ ఆరోపించింది. ఆయన కోల్‌కతాలోని ఓ రామాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన సమయంలో గవర్నర్ తన ఛాతికి 'బీజేపీ లోగో' ధరించారని టీఎంసీ పేర్కొంది. ఇలా గవర్నర్ బీజేపీ లోగో ధరించటం వల్ల ఓటర్లు ప్రభావితం అవుతారని తెలిపింది. రాష్ట్రపతి నియమించిన గవర్నర్‌కు రాజకీయ సిద్ధాంతాలు, ఆలోచనలు ఉండకూడదని టీఎంసీ ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది. ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవటం మానేయాలని గవర్నర్‌కు ఆదేశించాలని పోల్ ప్యానెల్‌కు విజ్ఞప్తి చేసింది. తమ ఫిర్యాదును పరిగణలోకి తీసుకొని గవర్నర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరింది.
బెంగాల్ గవర్నర్‌పై ఎన్నికల సంఘానికి టీఎంసీ ఫిర్యాదు !
الخميس، 23 مايو 2024
national west bengal ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవటం మానేయాలని బెంగాల్ గవర్నర్‌పై ఎన్నికల సంఘానికి టీఎంసీ ఫిర్యాదు లోక్‌సభ ఎన్నికల్లో గవర్నర్ బీజేపీకి ప్రచారం చేస్తున్నారని
ليست هناك تعليقات:
إرسال تعليق