గతంలో ప్రధాని నరేంద్ర మోడీ జీవితంపై బయోపిక్ రూపొందిన సంగతి తెలిసిందే. కాగా, దీనిని 'పీఎం నరేంద్ర మోడీ' పేరుతో 2019లో హిందీలో తెరకెక్కించారు. ఇందులో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే ఒమంగ్ కుమార్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అప్పటిలో ప్రేక్షకుల్ని బాగా అలరించింది. అయితే తాజాగా మళ్లీ మోడీ జీవితం మీద మరో బయోపిక్ తీసేందుకు రెడీ అవుతున్నారు. అయితే ప్రధాని బయోపిక్ లో ఇప్పటికే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది ప్రముఖల పేర్లు వినిపించాయి. అందులో ముఖ్యంగా బహుబలి నటుడు సత్యరాజ్ పేరు కూడా వినిపించింది. ఆయన మోడీ బయోపిక్ లో నటిస్తున్నారని రూమర్స్ వినిపించాయి. తాజాగా దీనిపై నటుడు సత్యరాజ్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవలే ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సత్యరాజ్ మోడి బయోపిక్ పై తాను నటిస్తున్నాని వస్తున్న రూమర్స్ పై స్పందించారు. ఈ సందర్భంగా సత్యరాజ్ మాట్లాడుతూ 'నేను నరేంద్ర మోడీ బయోపిక్‌లో నటించనున్నట్లు వస్తున్న వార్తల్లో ఎంత వరకు నిజం లేదు. పైగా ఆ ప్రాజక్ట్ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. అలాంటప్పుడు నేను ఆ పాత్రలో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలు చూసి నాకు ఆశ్చర్యం కలిగింది. సోషల్ మీడియాలో కూడా ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి. ఇకపోతే భవిష్యత్‌లో మోడీ బయోపిక్ కోసం నన్ను ఎవరైనా సంప్రదించినా నేను చేయననే చెప్తాను. ఎందుకంటే నేను నా సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండే అవాకాశం ఉంటుంది. ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి రూమర్స్ వచ్చాయి. ఇంతటితో ఆపేయండి' అని క్లారిటీ ఇచ్చారు.
ఛాన్స్ వచ్చినా మోడీ బయోపిక్‌లో నటించను !
الخميس، 23 مايو 2024
cinema national ఇప్పటికే చాలాసార్లు ఇలాంటి రూమర్స్ వచ్చాయి ఛాన్స్ వచ్చినా మోడీ బయోపిక్‌లో నటించను నా సిద్ధాంతాలకు పూర్తిగా వ్యతిరేకం సత్యరాజ్
ليست هناك تعليقات:
إرسال تعليق