ఆంధ్రప్రదేశ్ రైతుకు పొలంలో దొరికిన వజ్రం ?


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన రైతుకు పొలంలో విలువైన వజ్రం దొరికింది. పొలం పనులు చేస్తుండగా కంటపడిన వజ్రాన్ని రైతు భద్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. ఈ విషయం తెలిసి వ్యాపారులు పోటీ పడి వేలం నిర్వహించారు. ఇందులో పెరవల్లికి చెందిన ఓ వ్యాపారస్థుడు రూ.5 లక్షల నగదు, 2 తులాల బంగారం ఇచ్చి ఆ రైతు నుంచి వజ్రాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే, బహిరంగ మార్కెట్‌లో ఆ వజ్రం విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఏటా వర్షాకాలం తొలకరి సమయంలో కర్నూలు జిల్లాలో వజ్రాల కోసం పొలాల్లో రైతులు, కూలీలు వెతుకుతుంటారు. దీనికోసం ప్రత్యేకంగా భూమిని లీజుకు తీసుకుని, కూలీలను పెట్టి వెతికించే వాళ్లు కూడా ఉన్నారు.

Post a Comment

0 Comments