కేంద్ర హోం మంత్రి అమిత్ షా సతీమణి సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు ఆలయం మహా ద్వారం ముందు టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఆలయం ప్రధాన అర్చకులు అమిత్ షాకు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా, టీటీడీ ఈవో ధర్మారెడ్డి లడ్డు ప్రసాదాలను అందజేసి శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించారు. శ్రీవారి ఆలయం దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తిరుమలలో అమిత్ షా పర్యటన నేపథ్యంలో మీడియాపై ఆంక్షలు విధించారు. ఆలయం పరిసర ప్రాంతాల్లో ఎవరిని అనుమతించకుండా భద్రత కట్టుదిట్టం చేశారు.
శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న అమిత్ షా కుటుంబం !
الجمعة، 31 مايو 2024
Andhra Pradesh national అమిత్ షాకు ఘన స్వాగతం టీటీడీ ఈవో ధర్మారెడ్డి లడ్డు ప్రసాదాలను అందజేత వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న అమిత్ షా కుటుంబం
ليست هناك تعليقات:
إرسال تعليق