గూగుల్ మాట్లాడే ఎమోజీలను త్వరలోనే తీసుకురానున్నట్టు ప్రకటించింది. చాటింగ్ చేసేటప్పుడు అవతలి వ్యక్తికి మన హావభావాలు తెలిపేందుకు వీలుగా ఎమోజీలను క్రియేట్ చేశారు. ఇవి మొదట మెయిల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉండేవి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరింత పాపులర్ అయ్యాయి. ఈ ఎమోజీల్లో వందల రకాలుంటాయి. ఒక్కో సింబల్‌కు ఒక్కో అర్థం ఉంటుంది. అప్‌డేట్స్‌లో కొత్తవి కూడా వచ్చి చేరుతుంటాయి. అయితే తాజాగా గూగుల్ 'ఆడియో ఎమోజీ' పేరుతో ఓ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. స్టాటిక్ ఎమోజీలతో పాటు కదిలే ఎమోజీలు కూడా మనం చూస్తుంటాం. అయితే ఇప్పుడు రాబోయేది మాట్లాడే ఎమోజీలన్న మాట. ఈ ఆడియో ఎమోజీలు ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు యూజ్‌ఫుల్‌గా ఉంటాయని గూగుల్ చెప్తోంది. కాల్స్ మాట్లాడుకునేటప్పుడు ఎమోజీల ద్వారా సౌండ్ ఎఫెక్ట్‌లను పంపుకోవచ్చు. తద్వారా సంభాషణ మరింత మెరుగ్గా ఉంటుంది. సరికొత్త ఆడియో ఎమోజీల్లో బాధ, చప్పట్లు, సెలబ్రేషన్స్, నవ్వు.. ఇలా భిన్నమైన ఎమోషన్స్‌కు తగ్గట్టుగా కొన్ని సౌండ్ ఎఫెక్ట్‌లను కాల్స్ మాట్లాడేప్పుడు పంపుకోవచ్చు. ఈ ఫీచర్ ఫోన్ స్పీకర్ మోడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే పని చేస్తుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం గూగుల్ పిక్సెల్ ఫోన్స్‌లో బీటా యూజర్స్‌కు అందుబాటులో ఉంది. త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.
గూగుల్ లో మాట్లాడే ఎమోజీలు ?
الأحد، 26 مايو 2024
'ఆడియో ఎమోజీ' google science technology గూగుల్ లో మాట్లాడే ఎమోజీలు ? ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు యూజ్‌ఫుల్‌గా ఉంటాయని
ليست هناك تعليقات:
إرسال تعليق