ఆపిల్‌ యూజర్లకు ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెన్పాన్స్‌ టీం హెచ్చరిక ?

الثلاثاء، 21 مايو 2024

science technology అప్‌ డేట్‌ చేసుకోవాలని ఆపిల్‌ యూజర్లకు ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెన్పాన్స్‌ టీం హెచ్చరిక ? ఆపిల్‌ సంస్థ హెచ్చరిక

t f B! P L


ఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌, వాచ్‌ యూజర్ల కుఆపిల్‌ సంస్థ హెచ్చరిక మెసేజ్‌ ను పంపింది. అలాగే ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెన్పాన్స్‌ టీం కూడా ఆపిల్‌ ఉత్పత్తుల వినియోగదారులకు దాడులు జరిగే అవకాశం ఉందని అప్రమత్తత సందేశాన్ని పంపింది. దీంతోపాటు ఆపిల్‌ ఉత్పత్తుల వినియోగదారులు తమ పరికరాలను అప్‌ డేట్‌ చేసుకోవాలని కోరింది. ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌, ఆపిల్‌ వాచ్‌ మరియు ఆపిల్‌ టీవీ యూజర్ల కు సూచనలు చేసింది. ఈ పరికరాల్లో అనేక లోపాలను గుర్తించినట్లు తెలిపింది. ఈ భద్రతా లోపాల కారణంగా ఆయా పరికరాలపై దాడులు చేసి, వ్యక్తిగత డేటాను దొంగిలించే అవకాశం ఉందని తెలిపింది. ఆపిల్‌ iOS వెర్షన్‌ 16.7.8 కంటే ముందున్న వెర్షన్‌ ఈ కారణంగా ఎఫెక్ట్‌ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మరియు iPadOS 16.7.8 కంటే ముందు వెర్షన్‌, ఆపిల్‌ iOS మరియు iPadOS 17.5 కంటే ముందున్న, ఆపిల్‌ MacOS Monterey వెర్షన్‌ 12.7.5 కంటే ముందున్న వెర్షన్‌ లు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. దీంతోపాటు ఆపిల్‌ MacOS Ventura 13.6.7 కంటే ముందున్న వెర్షన్‌, ఆపిల్ MacOS Sonoma 14.5 కంటే ముందున్న వెర్షన్‌, ఆపిల్‌ వాచ్‌ OS 10.5 కంటే ముందున్న వెర్షన్‌, సఫారీ 17.5 కంటే ముందున్న వెర్షన్‌, ఆపిల్‌ tvOS 17.5 కంటే ముందున్న వెర్షన్‌లు ఈ భద్రతా లోపాల కారణంగా ఎఫెక్ట్‌ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కొత్తగా అందుబాటులోకి వచ్చిన వెర్షన్‌ లు కూడా అటాక్‌ బారిన పడే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ సైబర్‌ సెక్యూరిటీ వాచ్‌ డాగ్‌ గా వ్యవహరించే ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెన్పాన్స్‌ టీం (CERT-in) తెలిపింది. అందువల్ల యూజర్ల అప్రమత్తంగా ఉండాలని కోరింది. వెంటనే తమ డివైజ్‌ లను అప్‌డేట్‌ చేసుకోవాలని కోరింది. ఆపిల్‌ పరికరాల వినియోగదారులు తమ హ్యాండ్‌ సెట్ సెట్టింగ్స్‌ లోకి వెళ్లి వీలైనంత వేగంగా అప్‌ డేట్‌ చేసుకోవాలని సూచించింది. ఆపిల్ నుంచి తాజాగా అందుబాటులోకి వచ్చిన సాఫ్ట్‌ వేర్‌ అప్‌డేట్‌ లతో ఈ తరహా సైబర్‌ దాడుల నుంచి రక్షణ పొందవచ్చని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెన్పాన్స్‌ టీం తెలిపింది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ