తమిళనాడులోని కన్యాకుమారిలోని స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం నుంచి ధ్యానంలో కూర్చున్నారు. ఆయన 45 గంటలపాటు ఈ మెడిటేషన్ చేయనున్నారు. ఈ సమయంలో ఆయన కేవలం ద్రవాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం మోడీకి అందుబాటులో ఉంటాయి. ఈ సమయంలో ఆయన మౌనంగా ఉంటారు. మెడిటేషన్ హాల్ నుంచి 45 గంటల వరకు ఆయన బయటకు రారు. ఆయన కాషాయ దుస్తులు ధరించి, ధ్యానంలో కూర్చొని ఉన్న కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద కూడా ఇక్కడ ధ్యానం చేశారు.
స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద మోడీ 45 గంటల సుదీర్ఘ ధ్యానం !
الجمعة، 31 مايو 2024
national tamilnadu ద్రవాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారని ఫొటోలు నెట్టింట బాగా వైరల్ స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద మోడీ 45 గంటల సుదీర్ఘ ధ్యానం
ليست هناك تعليقات:
إرسال تعليق