ఆండ్రాయిడ్ 15 బీటా 2 వెర్షన్ విడుదల !


గూగుల్‌ డెవలపర్‌ కాన్ఫరెన్స్‌ i/o 2024 రెండో రోజు ఆండ్రాయిడ్ 15 బీటా 2 ను ఆవిష్కరించింది. గూగుల్‌ పిక్సల్‌ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పటికే ఈ OS అప్‌డేట్‌ను పొందింది. ఈ OS పూర్తి స్థాయి వెర్షన్‌ ఈ సంవత్సరం సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. ఈ ఆండ్రాయిడ్ బీటాను వన్‌ప్లస్‌, వివో, నథింగ్‌, లెనోవో, ఒప్పో, రియల్‌మి, టెక్నో, షియోమీ వంటి సంస్థలు పొందుతున్నాయి. వన్‌ప్లస్‌ 12, షియోమీ 14, రియల్‌మి 12 ప్రో + సహా అనేక స్మార్ట్‌ఫోన్‌ ఈ జాబితాలో ఉన్నాయి. గూగుల్‌ ఫోన్‌లు సహా ఇతర బ్రాండ్ల హ్యాండ్‌సెట్‌లు కూడా ఉన్నాయి. గూగుల్‌ పిక్సల్‌ సిరీస్‌- పిక్సల్‌ 6a, పిక్సల్‌ 7 సిరీస్‌, పిక్సల్‌ 7a, పిక్సల్‌ ట్యాబ్లెట్‌, పిక్సల్‌ ఫోల్డ్‌, పిక్సల్‌ 8 సిరీస్, పిక్సల్‌ 8a, వివోX100, ఐకూ 12, లెవోవో ట్యాబ్‌ ఎక్స్‌ట్రీమ్‌, వన్‌ప్లస్‌ 12, వన్‌ప్లస్‌ ఓపెన్‌, ఒప్పో ఫైండ్‌ N3, హానర్ మేజిక్‌ 6 ప్రో ఉన్నాయి. వీటితోపాటు హానర్‌ మేజిక్‌ V2, రియల్‌మి 12 ప్రో + 5G, షియోమీ 14, షియోమీ 13T ప్రో, షియోమీ ప్యాడ్‌ 6S ప్రో, షార్ప్ AQUOS, టెక్నో కెమెన్‌ 30 ప్రో 5G స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్‌ బీటా 15 బీటా 2 ను పొందనున్నాయి. ఆండ్రాయిడ్‌ 15 బీటా 2 అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. అందులో ముఖ్యమైనది ప్రైవేట్‌ స్పేస్‌ యాప్స్‌ ఫీచర్‌. దీని ద్వారా ప్రత్యేక ప్రొఫైల్‌ను క్రియేట్‌ చేసుకొని.. ముఖ్యమైన యాప్‌లను అందులో యాడ్‌ చేసుకోవచ్చు. ప్రొఫైల్‌ లాక్‌ సమయంలో నోటిఫికేషన్‌లు, రీసెంట్ యాప్స్‌, సెట్టింగ్స్‌లోనూ కనిపించవు. దీంతోపాటు యాప్‌ పెయిర్స్‌, స్ప్లిట్‌ స్కీన్‌ మోడ్‌లో ఒకేసారి రెండు యాప్‌లను లాంచ్‌ చేయవచ్చు. ఫలితంగా మల్టీ టాస్కింగ్‌ సమయంలో మెరుగైన పనితీరును పొందవచ్చు. దీంతోపాటు మీడియా పర్మిషన్‌ మేనేజ్‌మెంట్‌ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. యాప్‌లకు పాక్షితంగా అనుమతులు ఇచ్చినప్పుడు కొన్ని ఫోటోలు, వీడియోలను మాత్రమే యాక్సెస్‌ కలిగి ఉంటుంది. ఈ ఆండ్రాయిడ్‌ బీటా 2 అప్‌డేట్‌లో హెల్త్‌ కనెక్ట్‌ ఫీచర్‌లను కూడా కలిగి ఉంది. ఈ ఫీచర్‌ స్క్రిన్‌ టెంపరేచర్‌, ట్రైనింగ్ ప్లాన్‌లకు విస్తరించి ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు తన ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ గుర్తించి తెలుసుకొనేందుకు అవకాశం ఉంటుంది. ఇలా అనేక మెరుగైన ఫీచర్‌లను ఈ కొత్త OS కలిగి ఉంది.

Post a Comment

0 Comments