విప్రో సీఈఓగా పని చేస్తున్న థెర్రీ డెలాపోర్టే రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖను సంస్థ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో తెలిపింది. డెలాపోర్టే స్థానంలో శ్రీనివాస్ పాల్లియాను విప్రో కొత్త సీఈఓగా నియమిస్తున్నట్లు ధ్రువీకరించింది. ఏప్రిల్ ఆరో తేదీ నుంచి సీఈఓగా థెర్రీ డెలాపోర్టే రాజీనామాను ఆమోదిస్తున్నట్లు విప్రో డైరెక్టర్ల బోర్డు తెలిపింది. గత నెల 31 నుంచి డెలాపోర్టే రాజీనామా అమల్లోకి వస్తుందని పేర్కొంది. అజీం ప్రేమ్ జీ ఆధ్వర్యంలోని విప్రో సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్‌గా థెర్రీ డెల్లాపోర్టె 2020 జూలై నుంచి కొనసాగుతున్నారు. భారత ఐటీ రంగంలో అత్యధిక వేతనం అందుకున్న సీఈఓగా ఆయన నిలిచారు. టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ తర్వాత స్థానంలో విప్రో నిలుస్తుంది. డెలాపోర్టే వేతనం రూ.82 కోట్లకు పైగా వేతనం అందుకున్నారని విప్రో తెలిపింది.
విప్రో సీఈఓగా శ్రీనివాస్ పాల్లియా !
السبت، 6 أبريل 2024
science technology wipro రాజీనామా లేఖను సంస్థ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో తెలిపింది విప్రో సీఈఓగా శ్రీనివాస్ పాల్లియా సీఈఓగా పని చేస్తున్న థెర్రీ డెలాపోర్టే రాజీనామా
ليست هناك تعليقات:
إرسال تعليق