హోండా ప్రత్యేకమైన విద్యుత్ సైకెల్ ను తీసుకువస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటర్ల తరువాత ఎలక్ట్రిక్ కార్లకు కూడా భారీగానే డిమాండ్ పెరుగుతున్నది.. ఇప్పుడు ఎలక్ట్రిక్ సైకిల్ వంతు వచ్చేసింది. గత కొన్నేళ్లుగా డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడంతో చాలా మంది వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపుగానే మక్కువ చూపుతున్నారు. దీంతో పలు రకాల టూ వీలర్ త్రీ వీలర్స్ సైతం మార్కెట్లోకి వస్తున్నాయి. జపాన్ కి చెందిన హోండా ఒక అద్భుతమైన సైకిల్ ని తీసుకువచ్చింది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ సరికొత్త ఫీచర్స్ ని కలిగి ఉన్నది. ధర కూడా చాలా చౌక. కేవలం రూ .2000 రూపాయలు డౌన్ పేమెంట్ చేస్తే ఈ సైకిల్ ని పొందవచ్చు. ఈ సైకిల్ పేరు హోండా E-Mtb ఎలక్ట్రిక్ సైకిల్ ఫీచర్స్ విషయానికి వస్తే ఒకసారి చార్జింగ్ చేస్తే గరిష్టంగా 150 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. కేవలం మూడు గంటలలోనే చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ అత్యధిక ఎలక్ట్రిక్ సైకిల్ 45 కిలోమీటర్ల వేగంతో వెళుతుందట..దీని అసలు ధర రూ .20వేల రూపాయలు కాగా కేవలం రూ .2000 రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లిస్తే ఈ ఎలక్ట్రిక్ సైకిల్ సైతం మనం తీసుకోవచ్చు. మిగిలిన మొత్తాన్ని వాయిదా పద్ధతులలో చెల్లిస్తే సరిపోతుంది.. మార్కెట్లో కూడా ఎన్నో రకాల వివిధ ఎలక్ట్రిక్ సైకిల్స్ కూడా విడుదలవుతున్నాయి. వాటన్నిటిని మించి ఫీచర్స్ తో హోండా ఎలక్ట్రిక్ సైకిల్ వస్తోంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ సహాయంతో మనం ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి సులువుగా వెళ్ళవచ్చు.
హోండా E-Mtb ఎలక్ట్రిక్ సైకిల్ !
السبت، 16 مارس 2024
Electric Bicycles Honda science technology రూ .2000 రూపాయలు డౌన్ పేమెంట్ చేస్తే ఈ సైకిల్ ని పొందవచ్చు హోండా E-Mtb ఎలక్ట్రిక్ సైకిల్
ليست هناك تعليقات:
إرسال تعليق