ఆండ్రాయిడ్‌ సబ్‌ సిస్టమ్‌కు మైక్రోసాఫ్ట్‌ సపోర్టు నిలిపివేత ?


ఆండ్రాయిడ్‌ సబ్‌ సిస్టమ్‌కు మైక్రోసాఫ్ట్‌ తన సపోర్టును నిలిపివేయనుంది. ఫలితంగా విండోస్‌ 11ను వినియోగిస్తున్న కంప్యూటర్లలో ఆండ్రాయిడ్‌ యాప్స్‌ను వినియోగించలేరు. వచ్చే సంవత్సరం మార్చి 5 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. ఫలితంగా ఆయా కంప్యూటర్లలో యాప్స్‌ పనిచేయవు. విండోస్‌ సబ్‌సిస్టమ్‌ ఆధారిత ఆండ్రాయిడ్‌ యాప్‌లు, గేమ్స్‌ ఆ తేదీ నాటి నుంచి పనిచేయవు. దీంతోపాటు ఈ సంవత్సరం మార్చి 5 నుంచే కొత్త యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసే ఆప్షన్‌ కూడా అందుబాటులో లేకుండా పోయింది. దీంతోపాటు ఇప్పటికే ఉన్న యాప్స్ వచ్చే సంవత్సరం మార్చి 5 వరకు మాత్రమే పనిచేస్తాయి. మైక్రోసాఫ్ట్‌ మరియు అమెజాన్‌ యాప్‌స్టోర్‌ మధ్య 2021 సంవత్సరంలో కుదిరిన ఒప్పందం కారణంగా మైక్రోసాఫ్ట్‌ 11 ఆధారంగా పనిచేసే కంప్యూటర్లలో యాప్‌లు వినియోగిస్తున్నారు. వచ్చే సంవత్సరం మార్చి 5 తర్వాత WSA ఆధారిత యాప్‌లు, గేమ్స్‌లు పనిచేయవని మైక్రోసాఫ్ట్ అధికారిక నోట్‌ విడుదల చేసింది. కేవలం మూడు సంవత్సరాలలోనే ఒప్పందం నుంచి వెనక్కి తగ్గింది. ఇప్పటికే యాప్‌లు, గేమ్స్‌లు కంప్యూటర్లలో వినియోగిస్తున్న వారికి మాత్రం అప్పటి వరకు సాంకేతిక సాయం అందుతుందని సంస్థ పేర్కొంది. దీనిపై అమెజాన్ కూడా స్పందించింది. డెవలపర్లు కొత్త యాప్‌లు తమ యాప్‌స్టోర్‌కి సమర్పించే అవకాశం లేదని పేర్కొంది. ఈ నిర్ణయం మార్చి 5 నుంచే అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. అయితే ప్రస్తుత వినియోగదారులు మాత్రం సంవత్సర కాలంపాటు అప్‌డేట్లను పొందుతారని అమెజాన్‌ తెలిపింది. అయితే మైక్రోసాఫ్ట్‌ తీసుకున్న తాజా నిర్ణయం వెనుక అసలు కారణం ఏంటనేది తెలియలేదు. అయితే Ars Technica ప్రకారం మైక్రోసాఫ్ట్‌ విండోస్‌లో ఆండ్రాయిడ్‌ యాప్‌ యూజర్ల తక్కువగా ఉన్న కారణంగా మైక్రోసాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అంచనా వేస్తోంది. మార్చి 5 నుంచి మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ ద్వారా ఆండ్రాయిడ్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసే అవకాశం అందుబాటులో లేదు. ఈ రిపోర్టు మరో కీలక విషయాన్ని వెల్లడించింది. మైక్రోసాఫ్ట్‌ గూగుల్‌తోనూ ఎటువంటి ఒప్పందం కుదరలేదని పేర్కొంది. దాంతోపాటు అత్యధిక మంది యాప్‌ డెవలపర్లు ఇప్పటికే వెబ్‌ ఆధారిత ఇంటర్‌ఫేస్‌ లేదా ఇతర మార్గాల ద్వారా సమాచారాన్ని పంచుకుంటున్నారని పేర్కొంది.

Post a Comment

0 Comments