Ad Code

మరో బడ్జెట్ ఫోన్ లావా ఓ2 విడుదల !


దేశీయ మార్కెట్లో లావా ఇంటర్నేషనల్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ ఫోన్ లావా ఓ2 ఫోన్‌ను ఆవిష్కరించింది. ఈ  ఫోన్ యూనిసోక్ టీ616 ఎస్వోసీ, 8 జీబీ ర్యామ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. 50-మెగా పిక్సెల్ మెయిన్ సెన్సర్‌తో కూడిన డ్యుయల్ రేర్ కెమెరా కలిగి ఉంటుంది. 18 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నది. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు మద్దతుగా నిలుస్తుంది. దీని ధర రూ.8,499. ప్రారంభ ఆఫర్‌గా రూ.500 డిస్కౌంట్ అందిస్తుంది. 27 నుంచి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌, లావా ఈ-స్టోర్‌ల్లో కొనుగోలు చేయొచ్చు. ఇంపీరియల్ గ్రీన్‌, మేజిస్టిక్ పర్పుల్‌, రాయల్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. లావా ఓ2 ఫోన్ ఆండ్రాయిడ్ 13 వర్షన్‌పై పని చేస్తుంది. 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతో 6.5-అంగుళాల హెచ్‌డీ+ (720x1,600 పిక్సెల్స్‌) డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఫోన్ సెంటర్‌లో హోల్ పంచ్ కటౌట్ డిస్ ప్లే ఉంటుంది. ఒక్టాకోర్ యూనిసోక్ టీ616 ఎస్వోసీ చిప్‌సెట్‌తో వస్తుంది. 8 జీబీ ర్యామ్‌ను వర్చువల్‌గా 16 జీబీ ర్యామ్ వరకూ పొడిగించొచ్చు.ఎల్ఈడీ ఫ్లాష్‌తోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్డ్ 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా వస్తుంది. సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం స్క్రీన్ ఫ్లాష్‌తోపాటు ఫ్రంట్‌లో 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది. 128 జీబీ స్టోరేజీ కెపాసిటీని మైక్రో ఎస్డీ కార్డ్ సాయంతో 512 జీబీ వరకూ పొడిగించుకోవచ్చు. 4జీ వోల్ట్‌, బ్లూటూత్ 5, జీపీఆర్ఎస్‌, ఓటీజీ, వై-ఫై 802.11 బీ/జీ /ఎన్‌ /ఎసీ, 3.5 ఎంఎం ఆడియో జాక్‌, యూఎస్బీ టైప్‌-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటది. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌కు మద్దతుగా ఉంటుంది. యాక్సిలరో మీటర్‌, ఆంబియెంట్ లైట్‌, ప్రాగ్జిమిటీ సెన్సర్ కూడా ఉన్నాయి. 18వాట్ల ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో లావా ఓ2 (Lava O2) ఫోన్ వస్తుంది. సింగిల్ చార్జింగ్‌తో 36 గంటల టాక్ టైం, 500 గంటల వరకూ స్టాండ్‌బైగా ఉంటుంది. 

Post a Comment

0 Comments

Close Menu