దేశీయ మార్కెట్లో వన్ ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 1 వ తేదీన విడుదల చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ లాంఛ్ టీజర్ పేజ్ పైన అందించిన 'Notify me' బటన్ పైన నొక్కితే వన్ ప్లస్ కాంటెస్ట్ లో కూడా పాల్గొనే వీలుంది. ఇలా నోటిఫై బటన్ ను నొక్కిన వారిలో కోట మందికి ప్రైజ్ లను ఇవ్వనున్నట్లు వన్ ప్లస్ తెలిపింది. ఈ కాంటెస్ట్ లో గెలిచిన వారికి కొంత మందికి లేటెస్ట్ వన్ ప్లస్ ఫోన్ వన్ ప్లస్ నార్డ్ CE4 ను అందిస్తుంది. అలాగే, మరింత మందికి ఈ ఫోన్ కు తగిన ప్రీమియం ఫోన్ కేస్ ను ఇస్తుందని చెబుతోంది. అయితే, ఈ కాంటెస్ట్ కి కొన్ని నిమాలు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ను Qualcomm Snapdragon 7 Gen 3 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో తీసుకు వస్తున్నట్లు కన్ఫర్మ్ చేసింది. అంతేకాదు, ఈ ఫోన్ లో LPDDR4X 8GB RAM + 8GB అధనపు ర్యామ్ ఫీచర్ మరియు 256 GB వరకూ ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుందని వన్ ప్లస్ టీజర్ ద్వారా తెలిపింది. ఈ ఫోన్ రెండు కలర్ వేరియంట్ లలో వస్తుందని కూడా కంపెనీ టీజర్ ద్వారా చూపిస్తోంది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమేరా సెటప్ మరియు ముందు పంచ్ హోల్ డిజైన్ సెల్ఫీ కెమేరా ఉంటాయి.
ఏప్రిల్ 1న వన్ ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్ ఫోన్ విడుదల !
الاثنين، 18 مارس 2024
one plus science smart phone technology ఏప్రిల్ 1న వన్ ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్ ఫోన్ విడుదల వన్ ప్లస్ కాంటెస్ట్ లో కూడా పాల్గొనే వీలు
ليست هناك تعليقات:
إرسال تعليق