అమెరికా లోని కాలిఫోర్నియా చాప్‌మన్ విశ్వవిద్యాలయంలోని ష్మిడ్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు తమ స్వంత GenAI మోడల్‌ను రూపొందించాలని నిర్ణయించుకున్నారు. ఇది వివిధ రకాల వ్యాధులకు చికిత్స చేయడానికి కొత్త ఔషధాలను రూపొందించడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా "DrugAI" అని పేరు పెట్టబడిన ప్లాట్‌ఫారంను రూపొందించారు. ఈ DrugAI అనేది వ్యక్తుల ప్రోటీన్ సీక్వెన్స్‌ను ఇన్‌పుట్ చేయడానికి అనుమతిస్తుంది. తద్వారా ప్రత్యేక ప్రోటీన్లను నిరోధించే అవకాశం ఉన్న 50-100 కొత్త అణువులను గుర్తించవచ్చు. అంటే క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించవచ్చు, క్యాన్సర్ ను ఎదుర్కోగలిగే ఔషధాన్ని రూపొందించడం సులభం చేయవచ్చు. ఈ తరహా కృత్రిమ మేధను ఉపయోగించి ఎన్నడూ ఊహించని ఒక గొప్ప ఔషధాన్ని ఉత్పత్తి చేయడానికి అవకాశం లభిస్తుంది అని డాక్టర్ హాగోప్ అటామియన్ చెప్పారు. ఇప్పటికే తాము చేసిన కొన్ని పరీక్షలకు అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని ఆయన చెప్పారు. వేరొక ప్రయోగంలో, Covid-19 ప్రోటీన్‌లను నిరోధించే సహజ ఉత్పత్తుల జాబితాను drugAI రూపొందించింది. రోగుల లక్షణాలను, వారి ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకుని జనరేటివ్ కృత్రిమ మేధ ఒక ఔషధాల జాబితాను రూపొందించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఔషధాలు, కృత్రిమ మేధ రూపొందించిన ఔషధాల ఫార్ములాల మధ్య సారూప్యత, తీసుకున్న కొలతలు కచ్చితంగా సరిపోలాలి. అయితే డ్రగ్ ఏఐ దీనిని చాలా వేగంగా, తక్కువ ఖర్చుతోనే చేయగలిగింది. తాజా పరిణామాలను గమనిస్తే, రాబోయే రోజుల్లో ఫార్మా రంగంలో ఈ DrugAI విప్లవాత్మక మార్పులను, వినూత్న ఆవిష్కరణలను సృష్టిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ホーム
/
technology
/
ఫార్మా రంగంలో కృత్రిమ మేధతో ఔషధాల తయారీ ?
الخميس، 8 فبراير 2024
Manufacturing of drugs with artificial intelligence in the field of pharma? science Scientists at the Schmid College of Science and Technology at California Chapman University technology
ليست هناك تعليقات:
إرسال تعليق