సెల్ఫ్ డ్రైవింగ్ AI కారును తయారు చేసిన మహాదేవ్ నక్షానే !

الثلاثاء، 6 فبراير 2024

AI car on the Mumbai film city roads has become a sensation Mahadev Nakshan maharashtra national science Shark Tank India Season 3 technology who made a self-driving AI car

t f B! P L

 


ఒక చిన్న గ్యారేజ్ నుంచి ముంబాయ్ రోడ్లపైకి AI కార్లు వచ్చాయి. తాజాగా ముంబాయ్ ఫిల్మ్ సిటీ రోడ్స్ పై  AI కార్ ప్రయాణం సంచలనంగా మారింది. ‘షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ 3’లో తాజాగా AI కార్లు అనే ఐడియాతో మహాదేవ్ నక్షానే అనే యువకుడు జడ్జిల ముందుకు వచ్చాడు. AI కార్లు లాంటి భవిష్యత్తుకు సంబంధించిన ఐడియాతో జడ్జిలను ఇంప్రెస్ చేశాడు. మహారాష్ట్రలోని యావత్మల్ అనే చిన్న గ్రామానికి చెందిన వ్యక్తి మహేదేవ్ నక్షానే. ఇప్పటికే తను ‘AI కార్స్’ అనే సంస్థను కూడా స్థాపించాడు. హైడ్రోజన్ను ఉపయోగించి AI కార్లను తయారు చేయాలని ఉద్దేశ్యంతో ఈ స్టార్టప్ ని ప్రారంభించాడు. ఈ ఐడియా అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో ‘షార్క్ ట్యాంక్ ఇండియా’ షోలో కంటెస్టెంట్ గా  పాల్గొన్నాడు. తన టీమ్ తో  కలిసి ఈ AI కారును కేవలం 18 నెలల్లోనే తయారు చేశానని, అది కూడా తన ఇంటి వెనుక ఉన్న చిన్న గ్యారేజ్ లోనే దీన్ని తయారు చేశానని చెప్పడంతో జడ్జిలు ఆశ్చర్యపోయారు. దీనిని తయారు చేయడానికి రూ.60 లక్షలు ఖర్చు అయ్యిందని, ఇది హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్ తో నడుస్తుందని తెలిపాడు. ఒక సెల్ ను  రిఫ్యూయెల్ చేయడానికి 5 నిమిషాలు పడుతుందని, దాదాపు 1000 కిలోమీటర్లకు పైగా రన్ అవుతుందని తెలిపాడు. తన AI కార్స్ సంస్థను ముందుకు తీసుకువెళ్లడానికి రూ.2 కోట్ల పెట్టుబడి కావాలని కోరాడు. దీనికి బదులుగా కంపెనీలో 4 శాతం షేర్ ను ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. మహాదేవ్ చెప్పిన ఐడియా జడ్జిలకు నచ్చింది. కానీ అనుపమ్ మిట్టల్ కు  మాత్రం ఈ కారులో మనుషులు కూర్చోగలరా అని డౌట్ వచ్చింది. దీంతో స్పోర్ట్స్ కారులా కనిపించే AI కారును తమ ముందుకు తీసుకొచ్చాడు మహాదేవ్. ఆ తర్వాత అనుపమ్ మిట్టల్, నమితా థాపర్, వినీత సింగ్ కలిసి అందులో టెస్ట్ డ్రైవ్ కు  వెళ్లారు. ఈ కారును మహాదేవే డ్రైవ్ చేశాడు. కాసేపటికి తను స్టీరింగ్ ను వదిలేయగా ఆ తర్వాత బాధ్యత అంతా AI తీసుకుంది. ఎక్కడ టర్న్ తీసుకోవాలో, ఎక్కడ ఎంత స్పీడ్ గా  వెళ్లాలో AI చూసుకుంది. మహాదేవ్ ఇచ్చిన AI కార్స్ ఐడియా అందరు జడ్జిలను ఇంప్రెస్ చేసింది. కానీ అందులో ఎవ్వరూ కూడా ఈ ఐడియాలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు. ఇండియాలో AI కార్ ను తయారు చేయగలిగేంత హైడ్రోజన్ లేదని వారు ఫీల్ అయ్యారు. అందుకే మహాదేవ్ ను  ఏదైనా ఆటోమొబైల్ కంపెనీలో జాయిన్ అవ్వమని, తన టాలెంట్ తో అక్కడ కొత్త కొత్త ప్రయోగాలు చేయమని సలహా ఇచ్చారు. అంతే కాకుండా తను అడిగిన రూ.2 కోట్లతో పని అవ్వదని తేల్చి చెప్పారు. ‘‘చిన్న చిన్న గ్రామాల నుంచి వచ్చిన వారు పెద్దగా ఆలోచించడం బాగుంది. ఇలాంటివి చూసినప్పుడు మనకు చాలా గర్వంగా ఉంటుంది. కానీ ఇవి సరైన మార్గంలో లేకపోతే బాధగా అనిపిస్తుంది’’ అంటూ అనుపమ్ మిట్టల్ కామెంట్స్ చేశారు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ