లాస్ఏంజెల్స్, న్యూయార్క్, అస్టిన్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు లొకేషన్స్‌లో పనిచేస్తున్న దాదాపు వంద మంది ఉద్యోగులపై టిక్‌టాక్ వేటు వేసింది. ఆర్ధిక మందగమనం నేపధ్యంలో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా టిక్‌టాక్ లేఆఫ్స్‌కు మొగ్గుచూపిందని ఎన్‌పీఆర్ రిపోర్ట్ పేర్కొంది. వివిధ విభాగాలపై లేఆఫ్స్ ప్రభావానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదు. పునర్వ్యవస్ధీకరణ ప్రణాళికల కారణంగా సేల్స్, అడ్వర్టైజింగ్ విభాగానికి చెందిన దాదాపు 60 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్టు కంపెనీ ప్రతినిధి ధ్రువీకరించారు. 7000 మంది ఉద్యోగులతో అమెరికాలో టాప్ యాప్స్‌లో టిక్‌టాక్ ఒకటిగా నిలవగా ప్రమోటింగ్ కంపెనీ చైనీస్ టెక్ దిగ్గజం బైట్‌డ్యాన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 1,50,000 మందికిపైగా పనిచేస్తున్నారు. ఆర్ధిక మందగమనం, టెక్ పరిశ్రమలో సంక్షోభం కారణంగా టిక్‌టాక్ సైతం క్లిష్ట పరిస్ధితులను ఎదుర్కొంటోంది. దీంతో వ్యయ నియంత్రణ చర్యలతో కార్యకలాపాల పునర్వ్యవస్ధీకరణ చేపట్టింది. ఈ క్రమంలో పలు విభాగాల్లో ఉద్యోగుల సంఖ్యను టిక్‌టాక్ కుదిస్తోంది.
ホーム
/
లాస్ఏంజెల్స్
/
టిక్‌టాక్ లో లేఆఫ్స్ !
الثلاثاء، 23 يناير 2024
science technology అస్టిన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎన్‌పీఆర్ రిపోర్ట్ టిక్‌టాక్ లో లేఆఫ్స్ న్యూయార్క్ లాస్ఏంజెల్స్
ليست هناك تعليقات:
إرسال تعليق