ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డేకు కొన్ని రోజుల ముందు అమెజాన్ ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్, హెడ్‌సెట్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు సహా గృహోపకరణాలతోపాటు అనేక ఉత్పత్తులపై బెస్ట్ డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తోంది. దీంతోపాటు ఎంపికచేసిన బ్యాంకు కార్డులపై ఆకర్షణీయమైన తగ్గింపు ధరలను అందించనుంది. ఫోటోను హోం పేజీలోకి తీసుకొచ్చింది. అయితే ఎప్పటి నుంచి, ఎన్నిరోజుల పాటు ఈ సేల్ జరుగుతుందనే విషయాన్ని వెల్లడించలేదు. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ కలిగిన వినియోగదారులు సేల్‌ను ముందే యాక్సెస్ చేయవచ్చు. త్వరలో ప్రారంభం కానున్న అమెజాన్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లు మరియు సంబంధిత ఉపకరణాలపై 40 శాతం వరకు డిస్కౌంట్ అందించనున్నట్లు పేర్కొంది. 5G స్మార్ట్‌ఫోన్లు ధరలు రూ.9,999 నుంచి రూ.50,000 వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ల్యాప్‌టాప్, స్మార్ట్‌వాచ్‌లపై 75 శాతం వరకు తగ్గింపు ఆఫర్‌తో లభిస్తాయని అమెజాన్ తెలిపింది. దాంతోపాటు గ్రేట్ రిపబ్లిక్‌డే సేల్‌లో భాగంగా స్మార్ట్‌టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై 65 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ సేల్‌లో భాగంగా SBI బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేయడం మరియు EMI లావాదేవీలపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ పొందవచ్చని పేర్కొంది. ఎక్చ్సేంజీ ఆఫర్ ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చని తెలిపింది.
ホーム
/
హెడ్‌సెట్
/
అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ !
الأحد، 7 يناير 2024
science technology అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు సహా గృహోపకరణాలతోపాటు అనేక ఉత్పత్తులపై బెస్ట్ డిస్కౌంట్లు టాబ్లెట్‌లు ల్యాప్‌టాప్ స్మార్ట్‌ఫోన్లు హెడ్‌సెట్
ليست هناك تعليقات:
إرسال تعليق