స్విగ్గీ తాజాగా పాకెట్‌ హీరో అనే కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. బడ్జెట్ రేంజ్‌ యూజర్లను దృష్టిలోని ఉంచుకుని ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌ను మరింత తక్కువ ధరకు అందించడానికి స్విగ్గీ ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్‌లో ఫుడ్‌ను ఆర్డర్ చేయడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని భావించే వ్యక్తులను ఆకర్షించడానికి స్విగ్గీ 'పాకెట్‌హీరో' ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్‌తో యూజర్లు పార్ట్నర్ రెస్టారెంట్స్ ద్వారా డిస్కౌంట్‌తో ఫుడ్ ఐటమ్స్‌ను ఫ్రీ డెలివరీ ఆప్షన్‌తో పొందవచ్చు. కస్టమర్లు ఖర్చుల గురించి చింతించకుండా ఫుడ్ డెలివరీ సౌలభ్యాన్ని ఆస్వాదించేలా చేయడమే ఈ ఆఫర్ లక్ష్యమని స్విగ్గీ పేర్కొంది. పాకెట్‌హీరో ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు ఫుడ్ ఆర్డర్‌లపై 60% వరకు డిస్కౌంట్ పొందవచ్చు. ఫుడ్ డెలివరీ సెక్టార్‌లో ఈ రేంజ్ ఆఫర్లు చాలా అరుదు. పాకెట్‌హీరో ఆఫర్ ద్వారా ఒకవైపు కస్టమర్లు, మరోవైపు రెస్టారెంట్ పార్ట్నర్స్‌కు ప్రయోజనకరంగా ఉండేదుకు అవసరమైన ఏర్పాట్లపై స్విగ్గీ దృష్టి సారించింది. బడ్జెట్ పరిమితుల కారణంగా ఆర్డర్ చేయడానికి వెనుకాడే వినియోగదారులను ఆకర్షించి రెస్టారెంట్స్ వ్యాపారాన్ని పెంచడం కూడా ఈ ఆఫర్ లక్ష్యం. స్విగ్గీ వైస్ ప్రెసిడెంట్, నేషనల్ బిజినెస్ హెడ్ సిద్ధార్థ్ భకూ మాట్లాడుతూ.. 'పాకెట్‌హీరో అనేది కస్టమర్ల అవసరాలను గుర్తిస్తూ, వాటిని తీర్చడానికి కంపెనీ చేస్తున్న ప్రయత్నాల్లో ఒక భాగం. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీని ఖర్చులను కస్టమర్లు తగ్గించుకోవచ్చు. Pockethero మా పార్ట్నర్ రెస్టారెంట్స్ నుంచి బెస్ట్ డిస్కౌంట్లను అందిస్తుంది. ఆర్డర్‌ను ఉచితంగా డెలివరీ చేస్తాం. ఒక కంపెనీగా మేం కస్టమర్లను ఆకర్షించడానికి కొత్త ఆవిష్కరణలు చేస్తూనే ఉంటాం. ఇది (పాకెట్‌హీరో) మా టీమ్స్ ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న మరొక ప్రయత్నం.' అని చెప్పారు. కస్టమర్లు స్విగ్గీ యాప్ ద్వారా పాకెట్‌హీరో ఆఫర్ యాక్సెస్ పొందవచ్చు. ముందుగా యాప్‌లోఫుడ్ కేటగిరీ ట్యాప్ చేయాలి. ఆ తరువాత ఆఫర్ జోన్‌ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే పాకెట్‌హీరో ఆఫర్ ఉంటుంది. దాన్ని సెలక్ట్ చేసి అందుబాటులో ఉన్న డిస్కౌంట్స్, ఉచిత డెలివరీ ఆప్షన్స్ వంటి వివరాలు చెక్ చేసుకోవచ్చు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ