గూగుల్ కాంటాక్ట్స్ యాప్ యూజర్ ఫోన్ నంబర్ ఆధారంగా, అతని కరెంట్ లొకేషన్‌ను ట్రాక్ చేసే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మనం కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా విహారయాత్రకు వెళతాం. లేదా ఏదైనా ఫంక్షన్‌కు వెళతాం. మనతో వచ్చిన పిల్లలు లేదా పెద్దలు అప్పుడప్పుడూ తప్పిపోతూ ఉంటారు. దీనితో వాళ్లు ఎక్కడ ఉన్నారో తెలియక చాలా కంగారు పడిపోతూ ఉంటాం. కొన్నిసార్లు మనం కొత్త ఊరు వెళతాం లేదా సిటీకి వెళ్తాం. ఫ్రెండ్ రూమ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. కానీ అతను/ ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకపోతే, వారి లొకేషన్ తెలియక ఇబ్బందిపడుతూ ఉంటాం. ఈ సమస్యకు చెక్ పెడుతూ 'గూగుల్ కాంటాక్ట్స్ యాప్' సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం ఫోన్ నంబర్ ఉంటే చాలు, సదరు యూజర్ కరెంట్ లొకేషన్‌ను ఈ ఫీచర్ ద్వారా తెలుసుకోవచ్చు. గూగుల్ కాంటాక్ట్స్ యాప్ 4.22.37.586680692 వెర్షన్‌ను అప్డేట్ చేసుకున్న ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ నయా ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్లోని Settings ఓపెన్ చేయాలి. Apps సెక్షన్‌లోని Google Contacts ను సెలెక్ట్ చేసుకోవాలి. వెంటనే మీకు యాప్ ఇన్ఫో కనిపిస్తుంది. దీనిలోనే గూగుల్ కాంటాక్ట్స్ యాప్ వెర్షన్ నంబర్ కనిపిస్తుంది. లేటెస్ట్ 4.22.37.586680692 వెర్షన్ ఉంటే ఓకే. లేదంటే వెంటనే ఫోన్‌ను అప్డేట్ చేసుకోండి. ఈ నయా ఫీచర్‌తో మీ జీ-మెయిల్లో, ఫోన్ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారి కరెంట్ లొకేషన్‌ను మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇంతకు ముందు ఎవరైతో తమ లొకేషన్‌ను గూగుల్ మ్యాప్స్ ద్వారా మీకు షేర్ చేశారో, వారి కరెంట్ లొకేషన్‌ను కూడా మీరు ట్రాక్ చేయగలుగుతారు. ముందుగా గూగుల్ కాంటాక్ట్స్ యాప్ ఓపెన్ చేయాలి. ఎవరి లొకేషన్ తెలుసుకోవాలని అనుకుంటున్నారో, వారి ఫోన్ నంబర్‌ను ట్యాప్ చేయాలి. వెంటనే యూజర్ ఫొటో, అతని కాంటాక్ట్ వివరాలు కనిపిస్తాయి. అక్కడే Google Maps. Location Sharing ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఈ గూగుల్ మ్యాప్స్ లింక్‌ను ఓపెన్ చేస్తే, వెంటనే సదరు యూజర్ ఉన్న కరెంట్ లొకేషన్ మీకు కనబడుతుంది. మనం సదరు యూజర్ ఉన్న లొకేషన్‌కు వెళ్లాలంటే గూగుల్ మ్యాప్స్ అతను/ ఆమె ఉన్న డైరెక్షన్‌ను కూడా చూపిస్తుంది.
గూగుల్ కాంటాక్ట్స్ యాప్ ఫీచర్ !
الاثنين، 18 ديسمبر 2023
google science technology కరెంట్ లొకేషన్ ట్రాక్ గూగుల్ కాంటాక్ట్స్ యాప్ ఫీచర్ యూజర్ ఫోన్ నంబర్ ఆధారంగా లొకేషన్‌కు వెళ్లాలంటే గూగుల్ మ్యాప్స్ అతను/ ఆమె ఉన్న డైరెక్షన్‌ను కూడా చూపిస్తుంది
ليست هناك تعليقات:
إرسال تعليق