దేశీయ మార్కెట్లోకి డిసెంబర్ 22వ తేదీన పోకో ఎమ్6 5జీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకురానుంది. ఫ్లిప్‌కార్ట్‌లో 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 10 వేల లోపు ఉండొచ్చని తెలుస్తోంది. కొనుగోలు సమయంలో పలు బ్యాంక్ కార్డులపై డిస్కౌంట్స్ అందించనున్నారు. ఈ ఫోన్‌ను బ్లాక్, సిల్వర్ కలర్స్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఇందులో 6.74 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఇక ఈ ఫోన్‌ను 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో అందించనున్నారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 18 వాట్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. 50 మెగపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. అయితే ఫ్రంట్ కెమెరా గురించి ఎలాంటి సమాచారం అందించలేదు. సైడ్ మైంటెడ్ ఫింగర్ ప్రింట్‌తో పాటు, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్‌ను అందించారు.
22న పోకో ఎమ్6 5జీ విడుదల
الأربعاء، 20 ديسمبر 2023
22న పోకో ఎమ్6 5జీ విడుదల poco science smart phone technology పలు బ్యాంక్ కార్డులపై డిస్కౌంట్స్ ఫోన్ ధర రూ. 10 వేల లోపు ఉండొచ్చు
ليست هناك تعليقات:
إرسال تعليق