Ad Code

టెక్నో స్పార్క్‌ 20 స్మార్ట్‌ఫోన్‌ విడుదల !

టెక్నో స్పార్క్‌ 20 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ మీడియాటెక్‌ హీలియో G85 ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. మరియు 8GB ర్యామ్‌, 256GB స్టోరేజీతో ఆండ్రాయిడ్ 13 ఆధారిత HiOS 13 పై పనిచేస్తుంది. 6.6 అంగుళాల LCD డిస్‌ప్లేతో 720P రిజల్యూషన్ మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. టెక్నో స్పార్క్‌ 20 స్మార్ట్‌ఫోన్‌ 18W ఛార్జింగ్‌ సపోర్టుతో 5000 mAh బ్యాటరీ వుంటుంది. సైబర్‌ వైట్‌, గ్రావిటీ బ్లాక్, మేజిక్‌ స్కిన్‌ 2.0 ( బ్లూ ) మరియు నియోన్‌ గోల్డ్‌ రంగుల్లో లభిస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత HiOS 13 అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌గా రానుంది. మరియు 6.6 అంగుళాల HD+ LCD డిస్‌ప్లే సహా 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. మరియు 720* 1612 పిక్సల్స్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ డైనమిక్‌ పోర్ట్‌ ఫీచర్‌తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్‌ హీలియో G85 చిప్‌సెట్‌తో 8GB ర్యామ్‌తో జతచేయబడుతుంది. డ్యూయల్‌ 50MP ప్రైమరీ కెమెరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు డ్యూయల్‌ ప్లాష్‌ను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో చాట్‌ కోసం ఈ హ్యాండ్‌సెట్‌ ముందువైపు 32MP కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు రెండు LED ప్లాష్‌లను అమర్చారు. గరిష్ఠంగా 256GB అంతర్గత స్టోరేజీతో వస్తాయి. మైక్రో SD కార్డు సాయంతో స్టోరేజీని పెంచుకొనే వీలుంది. కనెక్టివిటీ పరంగా 4G, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 5.2, GPS మరియు USB-C పోర్టుతో వస్తుంది. దీంతోపాటు యాక్సెలిరోమీటర్‌, ఈ కంపాస్‌, వర్టస్‌ గైరోస్కోప్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సార్‌, ప్రాక్సిమిటీ సెన్సార్‌, మరియు ఫింగర్ ఫ్రింట్ సెన్సార్‌తో వస్తుంది. బ్యాక్‌ ప్యానల్‌ డిజైన్‌ ఇటీవల విడుదల అయిన ఇన్ఫినిక్స్ హాట్‌ 40i మాదిరిగా కనిపిస్తోంది. మరియు దూళి మరియు నీటి నుంచి రక్షణతో IP53 రేటింగ్‌ను కలిగి ఉంటుంది.


Post a Comment

0 Comments

Close Menu