పోకో అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ పోకో ఎక్స్6 5జీ గురించి బయటికి వచ్చిన ఒక కొత్త విషయం నెట్టింట చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల చైనా మార్కెట్ లో Xiaomi విడుదల చేసిన Redmi Note 13 Pro స్మార్ట్ ఫోన్ రీ బ్రాండెడ్ వెర్షన్ గ్లోబల్ మార్కెట్ లో పోకో ఎక్స్6 5జి పేరుతో లాంచ్ కావచ్చు. ఈ విషయాన్ని దృవీకరించే ఒక స్క్రీన్ షాట్ తో ప్రముఖ టిప్స్టర్ Kacper Skrzypek తన ట్విట్టర్ అకౌంట్ నుండి షేర్ చేశారు. అంతేకాదు, ఈ ఫోన్ BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ కోసం లిస్టింగ్ చేయబడినట్లు కూడా కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ప్రముఖ టిప్స్టర్ Kacper Skrzypek ట్వీట్ ప్రకారం, రెడ్ మి నోట్ 13 ప్రో లాంచ్ సమయంలోనే ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో పోకో డివైజ్ గా వస్తుందని ట్వీట్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ కు కొత్త అప్డేట్ ను జోడిస్తూ ఇది పోకో ఎక్స్6 5జి డివైజ్ కావచ్చని జోశ్యం చెప్పారు. అంతేకాదు, దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను కూడా జత చేశారు. అంటే, త్వరలోనే పోకో ఎక్స్6 5జి స్మార్ట్ ఫోన్ గ్లోబల్ మార్కెట్ తో పాటుగా భారత్ లో కూడా అడుగుపెట్టే అవకాశం ఉండవచ్చు. అంటే, చైనాలో విడుదలైన రెడ్ మి నోట్ 13 ప్రో యొక్క స్పెక్స్ లో చాలా వరకూ పోకో ఎక్స్6 5జి ఫోన్ లో మనం ఆశించవచ్చు.
పోకో ఎక్స్6 5జి ఫోన్ !
الأربعاء، 15 نوفمبر 2023
poco Redmi Note 13 Pro స్మార్ట్ ఫోన్ రీ బ్రాండెడ్ వెర్షన్ గ్లోబల్ మార్కెట్ లో పోకో ఎక్స్6 5జి పేరుతో లాంచ్ కావచ్చు science smart phones technology పోకో ఎక్స్6 5జి ఫోన్
ليست هناك تعليقات:
إرسال تعليق