ఈసిమ్ కంటే ఐసిమ్ అడ్వాన్స్ డ్ వెర్షన్ అని చెప్పాలి. దాని కంటే ఐసిమ్ పని తీరు మెరుగ్గా ఉంటుంది. భవిష్యత్తులో వచ్చే స్నాప్‌డ్రాగన్ చిప్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లకు ఈ ఐసిమ్ లను తీసుకొస్తున్నట్లు క్వాల్కామ్ సంస్థ ఇటీవల ప్రకటించింది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్ ఈ ఐసిమ్ కు ససోర్టు చేస్తుంది. భవిష్యత్తులో వినియోగదారులందరూ ఈ ఐసిమ్ లనే వినియోగిస్తారని క్వాల్కామ్ కచ్చితంగా చెబుతోంది.ఈ-సిమ్ లు నేరుగా ఫోన్ హార్డ్‌వేర్‌లోనే ఇన్ బిల్ట్ వస్తాయి. ప్రత్యేక చిప్‌లో సిమ్ ను ఇన్ స్టాల్ చేస్తారు. ఇది భౌతిక సిమ్ కార్డ్‌ల కంటే చిన్నదిగా ఉంటుంది. దీంతో ప్రత్యేకంగా సిమ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. దీంతో ఆ స్లిమ్ స్లాట్ కూడా ఫోన్ లో ఉండదు. ఆ స్థలం కూడా ఫోన్ లో కలిసివస్తుంది. ఈ-సిమ్ కావాలంటే ఏ నెట్ వర్క్ అయితే వినియోగస్తున్నారో ఆ ఆపరేటర్ ఆఫ్ లైన్ స్టోర్ కి వెళ్లాలి. లేదా యాప్ లో కూడా రిక్వెస్ట్ పెట్టొచ్చు. ఈ-సిమ్ ని యాక్టివేట్ లేదా ఎనేబుల్ చేసే ప్రక్రియ చాలా సులభం కానీ అన్ని ఆపరేటర్లకు ఒకే విధమైన ప్రక్రియ ఉండదు. ప్రాసెస్ మారుతుంటుంది. ఈ ఫోన్లలో మాత్రమే  ఈ-సిమ్ అన్ని ఫోన్లకు పని చేయదు. ప్రస్తుతం మన దేశంలో కొన్ని ప్రీమియం ఫోన్లకు మాత్రమే అందుబాటులో ఉంది. యాపిల్ కంపెనీ నుంచి ఐఓఎస్ వెర్షన్ 12.1 లేదా అంతకంటే ఎక్కువ వెర్షన్లకు మాత్రమే ఈ-సిమ్ సపోర్టు ఉంటుంది. ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఎస్ మ్యాక్స్, ఐఫోన్ 11 సిరీస్, ఐఫోన్ ఎస్ఈ సిరీస్, ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 13 సిరీస్, ఐఫోన్ 14 , ఐఫోన్ 15 మోడళ్లలో ఈ-సిమ్ పనిచేస్తుంది. అదే విధంగా ఆండ్రాయిడ్ ఫోన్లలో చాలా తక్కువ కంపెనీలకు చెందిన ఫోన్లకు మాత్రమే ఈ-సిమ్ సపోర్టు ఉంది. అవేంటంటే శామ్సంగ్, గూగుల్, మోటోరోలా, నోకియా, వివో ఫోన్లు అవి కూడా లేటెస్ట్ సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ అయ్యి ఉన్న ఫోన్లకు మద్దతిస్తుంది. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్, గెలాక్సీ ఫోల్డ్, గెలాక్సీ నోట్ 20 అల్ట్రా, గెలాక్సీ నోట్ 20, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 2, గెలాక్సీ ఎస్21 సిరీస్, గెలాక్సీ ఎస్20 సిరీస్, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3, గెలాక్సీ ఎస్ 22 సిరీస్, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4 ఫోన్లలో ఈ-సిమ్ సపోర్టు చేస్తుంది. ఇతర కంపెనీ విషయానికి వస్తే మోటోరోలా రాజ్ఆర్, మోటోరోలా నెక్ట్స్ జెన్ రాజ్ఆర్, మోటోరోలా ఎడ్జ్ 40, మోటోరోలా రాజ్ఆర్ 40 సిరీస్, నోకియా జీ60, నోకియా ఎక్స్30, వివో ఎక్స్90 ప్రో, గూగుల్ పిక్సల్ 3 ఫోన్లలో ఈ-సిమ్ సపోర్టు ఉంటుంది.ఈ-సిమ్ లు భౌతిక సిమ్ కార్డ్‌లు, వాటి స్లాట్ అవసరాన్ని తొలగిస్తాయి. ఫలితంగా మరింత కాంపాక్ట్ డివైజ్ డిజైన్‌లు చూడొచ్చు. ఇది సొగసైన, సన్నగా ఉండే పరికరాలు మనకు చేతిలో ఉంటాయి. ఎక్కువగా సిమ్ కార్డులు మార్చుకొనే వ్యక్తులకు ఇది బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఫిజికల్ సిమ్ ఉండదు కాబట్టి అంతా యాప్ లేదా ఆన్ లైన్ పోర్టల్లోనే జరిగిపోతుంది. ఇది సులభంగా, వేగంగా పూర్తయిపోతుంది. ఇవి మెరుగైన భద్రతా ఫీచర్లను అందిస్తాయి. అనధికారిక యాక్సెస్ లేదా ట్యాంపరింగ్ చేయడం చాలా కష్టం. తద్వార మీ సున్నితమైన డేటాను రక్షించడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. తరచుగా హ్యాండ్ సెట్లను మార్చినప్పుడు ఈ-సిమ్ ఇబ్బంది కలిగిస్తుంది. ఫిజికల్ సిమ్ కార్డును కొత్త ఫోన్‌కి సులభంగా బదిలీ చేయచ్చు. ఈ-సిమ్ యాక్టివేషన్ ప్రక్రియ మీరు పరికరాలను మార్చిన ప్రతిసారీ సెటప్ విధానాన్ని పునరావృతం చేయాల్సి ఉంటుంది.

ఈ-సిమ్ మాదిరిగానే ఐసిమ్ కూడా ఉంటుంది. కానీ ఇది చిప్‌సెట్‌లో కలిసిపోయి ఉంటుంది. ఆపరేట్ చేయడానికి అదనపు చిప్ అవసరం లేదు. నానో సిమ్ కార్డ్ కంటే ఐసిమ్ వంద రెట్లు చిన్నదిగా ఉంటుందని క్వాల్కామ్ ప్రకటించింది. ప్రస్తుతం ఇది స్నాప్ డ్రాగన్ 8జెన్ 2 ఎస్ఓసీలో మాత్రమే అందుబాటులో ఉంది. స్నాప్‌డ్రాగన్-ఆధారిత ఫోన్‌ల కోసం ప్రముఖ చిప్ తయారీదారు క్వాల్కామ్ ఐసిమ్ సాంకేతికను డెవలప్ చేసింది. ఇది ఈ-సిమ్ కన్నా అత్యాధునిక సాంకేతికతో వస్తుంది. మెరుగైన బ్యాటరీ జీవితాన్ని అందిస్తుంది.దీని ప్రాథమిక ప్రయోజనం ఏమిటంటే, ఇది సిమ్ కార్డ్ స్లాట్ అవసరాన్ని తొలగిస్తుంది, మెరుగైన స్పీకర్ లేదా అదనపు వైబ్రేషన్ మోటారు వంటి వాటి ద్వారా స్థలాన్ని ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఇది ఫోన్‌ను దుమ్ము మరియు నీటికి మరింత నిరోధకతను కలిగిస్తుంది. ఇతర ప్రయోజనాలు ఈ-సిమ్ మాదిరిగానే ఉంటాయి.ఐ-సిమ్ సపోర్టు చేసే ఫోన్లు ప్రస్తుతానికి, దీనికి సపోర్ట్ చేసే ఫోన్ ఏదీ లేదు. కానీ, స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఈ ఫీచర్‌ను అన్వేషిస్తున్నాయని, త్వరలోనే ఈ ఐసిమ్ కలిగి ఫోన్లు వచ్చే అవకాశం ఉందని క్వాల్కామ్ చెబుతోంది. భవిష్యత్తులో శామ్సంగ్ గెలాక్సీ ఫోన్లతో పాటు 300 మిలియన్ల ఐసిమ్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు చెప్పారు. 2030 నాటికి ఈ లక్ష్యం చేరుకుంటామని క్వాల్కామ్ పేర్కొంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ