వాట్సాప్‌లో గ్రూప్‌ కాలింగ్‌ పరిమితిపై పెంపు !


వాట్సాప్‌లో బాగా ప్రాచుర్యం పొందిన ఫీచర్స్‌లో గ్రూప్‌ కాలింగ్‌ ఒకటి. ఒకేసారి ఎక్కువ మంది యూజర్లు మాట్లాడుకునేందుకు గాను ఈ ఫీచర్‌ను తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌ను తీసుకొచ్చిన తొలి నాళ్లలో ఒకేసారి 7గురు మాట్లాడుకునేలా ఫీచర్‌ను తీసుకొచ్చారు. అనంతరం ఈ పరిమితిని 15కి పెంచుతూ నిర్ణయం తీసుకొచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ పరిమితిని మరోసారి పెంచుతూ వాట్సాప్‌ నిర్ణయం తీసుకుంది. ఈసారి ఏకంగా ఈ పరిమితిని 31 మందికి పెంచింది. అయితే ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కేవలం ఐఓఎస్ యూజర్ల కోసం మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది. మైక్రోసాఫ్ట్‌ మీట్‌, గూగుల్ మీట్‌ వంటి వాటికి పోటీగా ఈ ఫీచర్‌ ఉపయోగపడనుంది. ప్రస్తుతం ఐఓఎస్‌ వెర్షన్‌లో మాత్రమే ఈ ఫీచర్‌ను పరిచయం చేశారు. ఈ ఫీచర్‌ సహాయంతో ఒకేసారి 31 మంది గ్రూప్‌ కాల్‌ మాట్లాడుకోవచ్చు. ప్రస్తుతం యాపిల్‌ ఫోన్స్‌లోనే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ రానున్న రోజుల్లో ఆండ్రాయిడ్ ఫోన్స్‌లోనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. గ్రూప్‌ కాల్‌ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే ముందుగా మీరు కాల్‌ చేయాలనుకుంటున్న గ్రూప్‌ చాట్‌ను ఓపెన్ చేయాలి. అనంతరం స్క్రీన్ పైభాగంలో ఉన్న వీడియో కాల్ లేదా వాయిస్ కాల్ బటన్‌పై నొక్కాలి. అనంతరం గ్రూప్‌ కాల్ చేయాలనుకుంటున్న ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఒకవేళ గ్రూప్‌లో 31 మందికంటే ఎక్కువ ఉంటే మీరు మాట్లాడుకోవాలనకుంటున్న 31 మందిని ఎంచుకోవాలి. సభ్యులను ఎంచుకున్న తర్వాత వీడియో లేదా ఆడియో కాల్‌ బటన్‌పై నొక్కితే కాల్‌ని ప్రారంభించవచ్చు.

Post a Comment

0 Comments