ఒకాయా మోటో ఫాస్ట్ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేస్తోంది. ఇప్పటికే ఉన్న ఫాస్ట్ ఎఫ్2బీ, ఫాస్ట్ ఎఫ్2టీ వేరియంట్లకు తోడు అదనంగా మోటో ఫాస్ట్ ను లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇది కేవలం పర్యావరణ హితమైనదే కాకుండా స్టైల్, పనితీరులో కూడా అత్యద్భుతంగా ఉంటుంది.. మన రోడ్లకు తగ్గట్లుగా టెక్నాలజీ తో వస్తుంది. గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. పట్టణ ప్రాంతాలకు సరిగ్గా సరిపోతోంది. ముఖ్యంగా ట్రాఫిక్ ప్రాంతాల్లో అనువైన డ్రైవింగ్ ను అందిస్తుంది. ఈ స్కూటర్ సింగిల్ చార్జ్ 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఎక్స్ టెండెడ్ రేంజ్ కూడా ఉంటుంది. ఓవర్ హీటింగ్ సమస్య లేకుండా అదనపు భద్రతను అందిస్తుంది. దీనిలో ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ ఉంటుంది. యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ ఉంటుంది. మల్టీ మీడియా ఆప్షన్లు ఉంటాయి. వచ్చే నెలలో దీనిని గ్రాండ్ గా లాంచ్ చెయ్యనున్నారు. ఇకపోతే ఈ స్కూటర్ బ్లాక్, సియాన్, గ్రీన్, గ్రే, రెడ్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ. 1లక్ష నుంచి రూ. లక్షా ఏబై లోపే ఉంటుందని సమాచారం..
ఒకయా నుంచి మోటో ఫాస్ట్ స్కూటర్
السبت، 14 أكتوبر 2023
atuomobile elecric sctoor science technology ఒకయా నుంచి మోటో ఫాస్ట్ స్కూటర్ మల్టీ మీడియా ఆప్షన్లు యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ ఫేస్ సింగిల్ చార్జ్ 120 కిలోమీటర్లు
ليست هناك تعليقات:
إرسال تعليق