వొడాఫోన్ ఐడియా పోస్ట్‌పెయిడ్ యూజర్లను ఆకట్టుకునేందుకు వివిధ ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే ఈ ప్లాన్స్ ఎక్కువగా రూ.701 ప్లాన్ ఆదరణ పొందింది. వొడాఫోన్ ఐడియా రూ. 701 ప్లాన్ వినియోగదారులకు ఒక ప్రత్యేకమైన ఆఫర్‌గా నిలుస్తుంది. ఈ ప్లాన్ అపరిమిత డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది. ఒక వినియోగదారు ఒక బిల్లింగ్ వ్యవధిలో ఎంత డేటా వినియోగించవచ్చనే దానిపై పరిమితులు లేవు. ఇది ఖరీదైన ప్లాన్ అయినప్పటికీ చాలా మంది వినియోగదారులు ఆన్‌లైన్‌లో చేసే దాదాపు ప్రతిదానికీ మొబైల్ డేటాపై ఎక్కువగా ఆధారపడే వారు ఈ ప్లాన్ వాడుకోవచ్చు. అలాగే వారి మొబైల్ హాట్‌స్పాట్‌తో ఎక్కువ పరికరాలను కనెక్ట్ చేసుకోవచ్చు. వీఐ రూ.701 ప్లాన్‌తో వినియోగదారులు నిజంగా అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు నెలకు 3000 ఎస్‌ఎంఎస్‌లను పంపే వీలు ఉంటుంది. అలాగే అపరిమిత మ్యూజిక్ డౌన్‌లోడ్‌లతో 6 నెలల పాటు హంగామా మ్యూజిక్, వీఐ మూవీస్ & టీవీ, వీఐ గేమ్స్, ఆరు నెలల పాటు అమెజాన్ ప్రైమ్, ఓ ఏడాది డిస్నీ + హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్, సోనీ ఎల్‌ఐవీ ప్రీమియం, సన్ ఎన్‌ఎక్స్‌టీ సబ్‌స్క్రిప్షన్ల వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఈజీ డినర్ ప్రైమ్‌కు కూడా త్రైమాసిక సభ్యత్వాన్ని పొందవచ్చు. అలాగే ఈజ్‌మైట్రిప్ ద్వారా రిటర్న్ ఫ్లైట్ బుక్ చేసుకోవడానికి రూ.750 తగ్గింపు లభిస్తుంది. ముఖ్యంగా ఒక సంవత్సరం నార్టన్ 360 మొబైల్ సెక్యూరిటీ కవర్ లభిస్తుంది.
వొడాఫోన్ ఐడియా నుంచి రూ.701 పోస్ట్ పెయిడ్ ప్లాన్ !
الجمعة، 15 سبتمبر 2023
6నెలల పాటు అమెజాన్ప్రైమ్ internet science technology డిస్నీ+హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ వీఐ గేమ్స్ వీఐ మూవీస్ & టీవీ వొడాఫోన్ ఐడియా నుంచి రూ.701 పోస్ట్ పెయిడ్ ప్లాన్
ليست هناك تعليقات:
إرسال تعليق