ఆగస్టు 1న దేశీయ మార్కెట్లోకి రెడ్‌మి 12 విడుదల కానున్నది. గత నెలలో గ్లోబల్ మార్కెట్లలో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. లాంఛ్ ఈవెంట్ డేట్‌ను కంపెనీ ట్విట్టర్‌లో షేర్ చేసింది. రెడ్‌మి లేటెస్ట్ ఫోన్ క్రిస్టల్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో ఆకట్టుకోనుంది. బ్యూటీ, ఇన్నోవేషన్ మేలు కలయితో హాట్ డివైజ్‌ను ప్రవేశపెడుతున్నాం..క్రిస్టల్ గ్లాస్ డిజైన్‌తో, మా స్టైల్ ఐకాన్ దిశాపటానీతో రెడ్‌మి 12 ఆగస్టు 1న లాంఛ్ చేస్తున్నామని రెడ్‌మి ట్వీట్ చేసింది. ఇక గ్లోబల్ లాంఛ్‌తో కస్టమర్ల ముందుకొచ్చిన ఈ హాట్ డివైజ్ దాదాపు అవే ఫీచర్లతో దేశీ మార్కెట్‌లోనూ సందడి చేయనుందని భావిస్తున్నారు. రెడ్‌మి 12 యూజర్లకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అందించేలా 90హెచ్‌జడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.79 ఇంచ్ డిస్‌ప్లేతో కస్టమర్ల ముందుకు రానుంది. మీడియాటెక్ హెలియో జీ88 ప్రాసెసర్‌తో సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్, స్కై బ్లూ కలర్ ఆప్షన్స్ కలిగిఉంటుంది. ఇక రెడ్‌మి 12 4జీబీ ర్యాం 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యాం 128జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యాం 256జీబీ స్టోరేజ్‌తో మూడు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ, 2ఎంపీ కెమెరాలతో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రెడ్‌మి లేటెస్ట్ ఫోన్ ఆకట్టుకోనుండగా మ్యాక్రో కెమెరాతో పాటు 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఆకర్షణగా నిలవనుంది. ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌పై రన్ అయ్యే రెడ్‌మి లేటెస్ట్ ఫోన్ 18డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. ఇక ఈ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ భారత్‌లో రూ. 15,000లోపు అందుబాటులో ఉండనుంది. https://t.me/offerbazaramzon
ఆగస్టు 1న దేశీయ మార్కెట్లోకి రెడ్‌మి 12 విడుదల !
الاثنين، 10 يوليو 2023
redme science smart phone technology Xiaomi ఆగస్టు 1న దేశీయ మార్కెట్లోకి రెడ్‌మి 12 విడుదల స్మూత్ ఎక్స్పీరియన్స్ అందించేలా 90హెచ్‌జడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.79 ఇంచ్ డిస్ప్లే
ليست هناك تعليقات:
إرسال تعليق