దేశీయ మార్కెట్లోకి జపాన్‌కు చెందిన సుజుకీ హయబుసా పేరుతో బైక్ ను రిలీజ్ చేసింది. ఇంజిన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు కానీ కొత్త ఎమిషన్ స్టాండర్డ్ కు అనుగుణంగా OBD-2తో పాటు మూడు కొత్త రంగుల్లో ద్విచక్ర వాహనాన్ని సుజుకీ కంపెనీ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త హయబుసా బైక్ ధరను రూ. 16.90 లక్షలుగా నిర్ణయించింది. గత మోడల్‌తో పోలిస్తే రూ.49వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. బుకింగ్స్ కూడా మొదలైనట్లు సుజుకీ కంపెనీ వెల్లడించింది. హయబుసా బైక్‌లో 1340సీసీ ఫోర్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ను అమర్చారు. ఈ హయబుసాలో ఎప్పటికప్పుడు ఎమిషన్ స్టాండర్డ్స్ను తెలుసుకోవచ్చు. ఇందులోని ఇంజిన్ 187 BHPని, 150Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్, కార్నరింగ్ ABS, మూడు పవర్ మోడ్స్, క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉంటుంది.
సుజుకీ హయబుసా బైక్ !
السبت، 8 أبريل 2023
1340సీసీ ఫోర్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ automobile technologe గత మోడల్‌తో పోలిస్తే రూ.49వేలు అదనం బైక్ ధరను రూ. 16.90 లక్షలు సుజుకీ హయబుసా బైక్
ليست هناك تعليقات:
إرسال تعليق