హోలీ సీజన్‌లో అమ్మకాలు పెంచుకునేందుకు అన్ని బ్రాండ్‌లు వినియోగదారులను ఆకర్షించే పనిలో పడ్డాయి. స్పెషల్‌ డీల్స్‌ను అందిస్తున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ వంటి ఇకామర్స్‌ సైట్‌లలో సేల్స్‌ మొదలైపోయాయి. ఈ జాబితాలో తాజాగా శామ్‌సంగ్‌ కంపెనీ చేరింది. ఇన్‌స్టంట్‌ క్యాష్‌బ్యాక్, వోచర్‌లు, బ్యాంక్ క్యాష్‌బ్యాక్ వంటి డీల్స్‌ అందిస్తోంది. సేల్‌లో టాప్ ఎండ్ స్మార్ట్‌ఫోన్‌లు, ఫోల్డబుల్స్ ఉన్నాయి. శామ్‌సంగ్‌ ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌లను ఉపయోగించుకుని వినియోగదారులు భారీ తగ్గింపును అందుకోవచ్చు. లేటెస్ట్‌ శామ్‌సంగ్‌ గెలాక్సీ S23 సిరీస్ అధిక ధర కారణంగా అవసరం లేదని భావిస్తుంటే.. హోలీ డీల్స్‌లో శామ్‌సంగ్‌ గెలాక్సీ S22 బెస్ట్‌ ఆప్షన్‌ అవుతుంది. రూ.85999 విలువైన ఈ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.26999కి సొంతం చేసుకోవచ్చు. శామ్‌సంగ్‌ గెలాక్సీ S22 దాదాపు 6.1 అంగుళాల ఫుల్‌ HD+ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సెల్‌ల హై రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌ వీడియోలను చూడటానికి, గేమ్‌లు ఆడటానికి చక్కగా సరిపోతుంది. డివైజ్‌ మెటల్, గ్లాస్‌ నిర్మాణంతో స్లిమ్, స్లీక్‌ డిజైన్‌తో రూపొందింది. Exynos 2100 చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. డివైజ్‌ 8GB RAM, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌ అందిస్తోంది. దీనిని మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు ఎక్స్‌ప్యాండ్‌ చేసుకునే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 10-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాతో ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంటుంది. ముందువైపు హై క్వాలిటీ సెల్ఫీలు తీసుకోవడానికి 10-మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో USB టైప్-C పోర్ట్, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, NFC, ఇతర వైర్‌లెస్ కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. వివిధ 5G బ్యాండ్‌లలో డ్యూయల్-5G స్టాండ్‌బైకి సపోర్ట్‌ చేస్తుంది. డ్యూయల్-సిమ్ ట్రే కూడా ఉంది. శామ్‌సంగ్‌ గెలాక్సీ S22 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ రిటైల్‌ ధర రూ.85999. శామ్‌సంగ్‌ హోలీ సందర్భంగా రూ.28000 భారీ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. ప్రస్తుతం ఈ డివైజ్‌ను కేవలం రూ.52999కే సొంతం చేసుకోవచ్చు. శామ్‌సంగ్‌ కంపెనీ గెలాక్సీ S22 కొనుగోలుపై రూ.31000 వరకు ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ను అందిస్తోంది. అయితే ఎక్స్ఛేంజ్‌ చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌ కండిషన్‌ ఆధారంగా ప్రైస్‌ మారుతుంది. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ని సద్వినియోగం చేసుకుంటే కేవలం రూ.26999కే గెలాక్సీ ఎస్‌22ని సొంతం చేసుకోవచ్చు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ