యాపిల్ పే లేటర్‌ను లాంఛ్ చేసింది. ఈ సర్వీస్ ద్వారా యూజర్లు ఎలాంటి ఫీజులు, వడ్డీ లేకుండా 50 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకూ రుణం పొందే వెసులుబాటు కలుగుతోంది. ఈ సర్వీస్ ద్వారా ప్రొడక్ట్స్ కొనుగోలుపై యూజర్లు ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో చెల్లింపులు చేయవచ్చు. ఆరు వారాల్లో నాలుగు వాయిదాల రూపంలో ఈ రుణాలను యూజర్లు తిరిగి చెల్లించవచ్చు. యాపిల్ పే పేమెంట్ పద్ధతిని ఆమోదించిన వ్యాపారుల నుంచి యూజర్లు ఈ లోన్స్‌ను ఆన్‌లైన్, యాప్ కొనుగోళ్ల కోసం తమ ఐఫోన్, ఐప్యాడ్‌లపై పొందవచ్చు. ఈ చెల్లింపులను యూజర్ యాపిల్ వాలెట్ పర్యవేక్షిస్తుండటంతో యూజర్లు తాము ఎంత ఖర్చు చేస్తున్నామనేది ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే వీలుంది. యాపిల్ పే ల్యాటర్ ప్రీ-రిలీజ్ వెర్షన్‌ను యాక్సెస్ చేసుకునేందుకు ఎంపిక చేసిన యూజర్లను యాపిల్ ఆహ్వానిస్తుందని కంపెనీ ప్రకటించింది. మరో రెండు నెలల్లో అర్హులైన యూజర్లందరికీ ఈ సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యాపిల్ కసరత్తు సాగిస్తోంది.
యాపిల్ నుంచి పే లేటర్ లాంఛ్
الأربعاء، 29 مارس 2023
apple apple products technologe యాపిల్ నుంచి పే లేటర్ లాంఛ్ వడ్డీ లేకుండా 50 డాలర్ల నుంచి 1000 డాలర్ల వరకూ రుణం
ليست هناك تعليقات:
إرسال تعليق