గ్రీవ్స్ కాటన్‌కు చెందిన గ్రీవ్స్ రిటైల్ తన ఎలక్ట్రిక్ టూవీలర్ కొనుగోలుపై పరిమిత కాలం ఆఫర్ అందుబాటులో తెచ్చింది. రూ. 30 వేల విలువైన ఎలక్ట్రిక్ సైకిల్ గెలుచుకునే అవకాశం ఒకటి అందుబాటులో తెచ్చింది. ఈ కంపెనీ జీల్ ఈఎక్స్, మాగ్నస్, ప్రీమస్ అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లో విక్రయిస్తోంది. యాంపియర్ బ్రాండ్ కింద ఎలక్ట్రిక్ స్కూటర్లను అందుబాటులో ఉంచింది. యాంపియర్ ప్రిమస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కంపెనీ ఇటీవలనే మార్కెట్‌లోకి తెచ్చింది. దీని టాప్ స్పీడ్ గంటకు 77 కిలోమీటర్లు. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 4.2 సెకన్లలోనే అందుకుంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 107 కిలోమీటర్లు వెళ్లొచ్చు. 48 వీ 3 కేడబ్ల్యూ లిథియం అయాన్ బ్యాటరీ అమర్చారు. బ్యాటరీ ఫుల్ కావడానికి 5 గంటలు పడుతుంది. ఎకో, సిటీ, పీడబ్ల్యూఆర్, రివర్స్ అనే రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. కాంబి బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. దీన్ని కేవలం రూ. 499తో బుక్ చేసుకోవచ్చు. దీని ధర రూ. 1,09,900గా ఉంది. జీల్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే.. దీని రేంజ్ 80 నుంచి 100 కిలోమీటర్ల వరకు ఉంటుంది. బ్యాటరీ పుల్ కావడానికి 5 గంటలు పడుతుంది. దీని ధర రూ. 69,900గా ఉంది. దీని టాప్ స్పీడ్ గంటకు 55 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మ్యాగ్నస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 82 వేలుగా ఉంది. కాగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపై చౌక వడ్డీకే లోన్ పొందొచ్చు. వడ్డీ రేటు 8.99 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. గ్రీవ్స్ రిటైల్ అనేది మల్టీ బ్రాండ్ ఈవీ ప్లాట్‌ఫామ్. ఈ షోరూమ్‌లో పలు కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ బైక్స్, ఎలక్ట్రిక్ సైకిల్, ఎలక్ట్రిక్ ఆటోలు అందుబాటులో ఉంటాయి.
ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే రూ.30 వేల ఎలక్ట్రిక్ సైకిల్ గెలుచుకునే అవకాశం !
الأحد، 12 مارس 2023
electric scooter technologe ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటే రూ.30 వేల ఎలక్ట్రిక్ సైకిల్ గెలుచుకునే అవకాశం గ్రీవ్స్ రిటైల్ తన ఎలక్ట్రిక్ టూవీలర్ యాంపియర్ ప్రిమస్ ఎలక్ట్రిక్ స్కూటర్
ليست هناك تعليقات:
إرسال تعليق