20 కోట్ల మంది ట్విట్టర్ యూజర్ల డేటాను డార్క్ వెబ్ ద్వారా 2 లక్షల డాలర్లకు అమ్మినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ క్లౌడ్ఎస్ఈకే ఇప్పటికే వెల్లడించింది. ట్విట్టర్ యూజర్లకు సంబంధించిన ఈమెయిల్ ఐడీస్, పేరు, స్క్రీన్ నేమ్, యూజర్ నేమ్, అకౌంట్ క్రియేట్ చేసుకున్న డేట్, ఫాలోవర్ల సంఖ్య సహా పలు వివరాలను హాకర్లు దొంగిలించినట్లు తెలిపింది. 8 హ్యాకర్ గ్రూప్స్ ఈ వివరాలను సేకరించి అమ్మినట్లు ప్రకటించింది. తాజాగా యూజర్ల డేటా హ్యాక్ కు సంబంధించి ట్విట్టర్ స్పందించింది. 200 మిలియన్ల మంది వినియోగదారుల డేటాను ఆన్ లైన్ లో విక్రయించబడుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించింది. హ్యాక్ అయిన డేటా వివరాలు మైక్రో-బ్లాగింగ్ ప్లాట్ ఫారమ్ కు సంబంధించిన సిస్టమ్ ల లోని బగ్ ఫలితంగా జరగలేదని ట్విట్టర్ తెలిపింది. "మీ గోప్యతను రక్షించడానికి మేము చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నాం. ట్విట్టర్ వినియోగదారుల డేటా ఆన్ లైన్లో విక్రయించబడుతుందని ఇటీవలి మీడియా నివేదికలకు ప్రతిస్పందనగా, మేము సమగ్ర దర్యాప్తు చేశాం. ఇటీవల విక్రయించిన డేటా ట్విట్టర్ బగ్ కారణంగా జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. మేం ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ఓ సంఘటన గురించి అప్ డేట్ ను కూడా అందుబాటులోకి తీసుకు రావాలి అనుకుంటున్నాం. ఇందుకోసం మేము తీసుకున్న చర్యలపై పారదర్శకతను అందించాలనుకుంటున్నాం" అని ట్విట్టర్ ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఎలన్ మస్క్ యాజమాన్యంలోని ట్విట్టర్ సంస్థ ప్రకారం.. ‘‘లీక్ అయిన డేటాతో వినియోగదారుల సమాచారం సరిపోలలేదు. అందుకే, సమస్య గురించి పరిశోధించేందుకు విశ్లేషణ జరుపుతున్నాం. ఆన్ లైన్లో విక్రయించబడుతున్న డేటా ట్విట్టర్ సిస్టమ్ బగ్ ద్వారా పొందినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. డేటా ఇప్పటికే ఆన్ లైన్లో పబ్లిక్ గా అందుబాటులో ఉన్న డేటా అయ్యి ఉండవచ్చు. డేటా లీక్ సంఘటనల గురించి వివరణను అందించడానికి మేం వివిధ దేశాల నుంచి డేటా సెక్యూరిటీ ఆఫీసర్స్, ఇతర సంబంధిత రెగ్యులేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నాం’’ అని ట్విట్టర్ తెలిపింది. గత వారం ప్రారంభంలో, హ్యాకర్ వెబ్ సైట్ బ్రీచ్ ఫోరమ్స్ లో వందల మిలియన్ల మంది ట్విట్టర్ వినియోగదారుల ప్రాథమిక సమాచారం కలిగిన డేటా బేస్ ఓ అకౌంట్ ద్వారా పోస్టు చేశారు. StayMad అని పిలుచుకునే హ్యాకర్ సుందర్ పిచాయ్, డోనాల్డ్ ట్రంప్ జూనియర్, SpaceX, CBS మీడియా, NBA, WHO సహా 200 మిలియన్లకు పైగా వినియోగదారుల వ్యక్తిగత డేటాను లీక్ చేసినట్లు వెల్లడించాడు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ