మీ స్మార్ట్ ఫోన్ లో ఈ కొత్త మార్పులు కనిపిస్తున్నాయా? అయితే, మీ ఫోన్ హ్యాక్ అయినట్లు మీరు సందేహ పడవచ్చు. ఎందుకంటే, రెగ్యులర్ గా మీ ఫోన్ ను మీరు చూస్తుంటారు, కొన్ని సమయాల్లో మీ ఫోన్ లో ప్రత్యేక లక్షణాలు కనిపిస్తే, మీరు జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. టెక్నాలజీ పెరిగిన తరువాత ప్రతి విషయం చాలా సులభంగా మారింది. ప్రజలు చాలా సులభంగా వారి పనులను వారి మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్లో చేసుకోవడానికి అలవాటు పడిపోయారు. సరిగా ఇదే విషయాన్ని టార్గెట్ చేస్తున్న కొందరు హ్యాకర్లు, మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసే యాడ్స్ ను అడ్వార్టైజ్ చేయడం లేదా పర్సనల్ డేటాను చేజిక్కించు కోవడం వంటి అనైతిక పనులకు పాల్పడుతున్నారు. ఫోన్ హ్యాక్ అయినట్లయితే బ్యాటరీ బ్యాకప్ అసాధారణంగా ఉంటుంది. అంటే, చాలా త్వరగా మీ ఫోన్ బ్యాటరీ అయిపోతుంది. అలాగే, మీరు వాడకుండానే మీ డేటా అయిపోతుంది లేదా మీరు ఉపయోగించే డేటా కంటే అధికంగా డేటా ఖర్చు అవుతుంది. బాగా వేగంగా పనిచేసే ఫోన్ స్పీడ్ సడన్ గా పడిపోతుంది. ఫోన్ లో రన్నింగ్ లో ఉన్న యాప్స్ క్లోజ్ అవ్వడం, ఫోన్ దానంతట అదే Restart అవ్వడం వంటి లక్షణాలు లేదా గుర్తులు మీకు కనిపిస్తే, మీ ఫోన్ హ్యాక్ అయినట్లుగా మీరు గుర్తించవచ్చు. ఈ లక్షణాలను చాలా కాలంగా ఉపయోగిస్తున్న పాత మొబైల్ లలో చూసే సాధారణ సమస్యగా మీరు గుర్తించవచ్చు. అయితే, కొత్తగా తీసుకున్న లేటెస్ట్ ఫోన్లలో మీరు సమస్యలను గుర్తించినట్లయితే, మీ ఫోన్ హ్యాక్ అయినట్లుగా మీరు సందేహపడవచ్చు.
స్మార్ట్ ఫోన్ - హ్యాక్ సమస్య !
الاثنين، 9 يناير 2023
science smart phones technologe జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది ప్రత్యేక లక్షణాలు కనిపిస్తే స్మార్ట్ ఫోన్ - హ్యాక్ సమస్య !
ليست هناك تعليقات:
إرسال تعليق