జియో ల్యాప్ టాప్ ఇప్పుడు మంచి డిస్కౌంట్ ధరతో పాటు అతి తక్కువ ఈఎంఐ  అప్షన్ తో లభిస్తోంది. రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుండి 56% డిస్కౌంట్ తో లభిస్తోంది. రూ.759 అతి తక్కువ ఈఎంఐ చెల్లింపు పద్దతిలో కూడా పొందే అవకాశం కూడా అందించింది. ఈ అఫర్ కేవలం క్రెడిట్ కార్డ్స్ పైన మాత్రమే వర్తిస్తుంది. జియోబుక్ ను ముందుగా రూ.19,500 ధరతో ప్రభుత్వ ఇ-మార్కెట్ ప్లేస్ (GeM) లో లిస్టింగ్ చేసింది. అయితే, ఇప్పుడు జియో ఈ ల్యాప్ టాప్ ను కేవలం రూ.15,799 రూపాయల ధరతో సేల్ చేస్తోంది. జియోబుక్ ను రిలయన్స్ డిజిటల్ స్టోర్ నుండి పొందవచ్చు. అంతేకాదు, ఈ ల్యాప్ టాప్ ను అన్ని ప్రధాన బ్యాంక్స్ క్రెడిట్ కార్డ్ ద్వారా అతితక్కువ ఈఎంఐతో కూడా లభిస్తుంది. జియోబుక్ 11.6 ఇంచ్ డిస్ప్లేతో వుంది మరియు ఇది HD (1366×768) రిజల్యూషన్ తో ఉంటుంది. ఇది LED బ్యాక్లైటింగ్తో కూడిన TN ప్యానెల్ మరియు యాంటీ-గ్లేర్ ఫీచర్ లను కలిగి ఉంది. జియోబుక్ Qualcomm Snapdragon 665 ఆక్టా కొర్ ప్రాసెసర్ శక్తితో పని చేస్తుంది మరియు Adreno 610 GPU తో ఉంటుంది. ఈ ల్యాప్ టాప్ 2GB LPDDR4x RAM మరియు 32GB eMMC స్టోరేజ్ తో వస్తుంది. మీరు కోరుకుంటే SD కార్డ్ ద్వారా స్టోరేజ్ ను మరింతగా పెంచుకోవచ్చు. లేటెస్ట్ JioOS పైన నడుస్తుందని జియో తెలిపింది. అయితే, ఇది ఆండ్రాయిడ్ ఆధారితంగా ఉంటుందా లేక ఉండదా అనే విషయం పైన ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ, మైక్రోసాఫ్ట్ యాడ్ బ్రౌజర్ వంటి కొన్ని ముందే ఇన్స్టాల్ చెయ్యబడిన యాప్లను మీరు ఈ ల్యాప్ టాప్ తో పొందుతారు మరియు జియో క్లౌడ్ PC కి కూడా సపోర్ట్ ఉంది. 4G సపోర్ట్, USB-A 2.0 పోర్ట్, USB-A 3.0 పోర్ట్, HDMI పోర్ట్, WiFi ac మరియు బ్లూటూత్ 5.0 వంటి కనెక్టివిటీ అప్షన్లు ఉన్నాయి. ఇక జాబితా చేయబడిన బ్యాటరీ పరిమాణం 55.1 నుండి 60 AH వరకు వుంటుంది మరియు ఇది 8 గంటల వరకుబ్యాకప్ ఇస్తుందని చెబుతోంది. ఈ జియో ల్యాప్ టాప్ లో మీరు డ్యూయల్ స్పీకర్ సెటప్, డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ మైక్ సెటప్ మరియు స్టాండర్డ్ నో బ్యాక్లిట్ కీబోర్డ్ ను కూడా పొందుతారు. 

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ