వన్‌ప్లస్ డెస్క్‌టాప్ మానిటర్ల విభాగంలో అడుగుపెడుతోంది. డిసెంబర్ 12న కొత్తగా రెండు డెస్క్‌టాప్ మానిటర్లను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. వన్‌ప్లస్ మానిటర్ ఎక్స్ 27, వన్‌ప్లస్ మానిటర్ ఈ24 పేర్లతో మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని కంపెనీ ట్విట్టర్ పేజీలో పెట్టిన టీజర్లో పేర్కొంది. అలాగే అధికారిక వెబ్‌సైట్‌లోనూ ప్రకటించింది. ఉచితంగా మానిటర్లను గెలుచుకునేందుకు ఒక లక్కీడ్రాను కూడా కంపెనీ నిర్వహిస్తోంది. వన్‌ప్లస్ ఎక్స్27 మానిటర్ మోడల్ 27 ఇంచుల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇక వన్‌ప్లస్ ఎక్స్ 24 మోడల్ 24 ఇంచుల స్క్రీన్‌తో వస్తుంది. వీటిలో ఓ మోడల్ పోట్రయిడ్ మోడ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ మానిటర్లలో గేమింగ్ ఎక్స్పీరియన్స్ అదిరిపోతుందని వన్‌ప్లస్ తన టీజర్లో పేర్కొంది. అయితే వీటి ధరలపై అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ఎక్స్ 27 మానిటర్ ప్రీమియం రేంజ్, ఈ24 మానిటర్ మిడ్‌రేంజ్‌లో లభించనున్నాయి. దేశంలోని కొనుగోలుదారుల కోసం ఈ మోడల్‌లను రూ.20,000 లోపు విడుదల చేసే అవకాశం ఉంది.
డిసెంబర్ 12న వన్‌ప్లస్ నుంచి రెండు డెస్క్‌టాప్ మానిటర్లు !
الخميس، 1 ديسمبر 2022
oneplus science technologe ఈ24 ఎక్స్ 27 డిసెంబర్ 12న వన్‌ప్లస్ నుంచి రెండు డెస్క్‌టాప్ మానిటర్లు !
ليست هناك تعليقات:
إرسال تعليق