అమెజాన్ గడచిన ఏడాది కాలంలో లక్ష డాలర్లు మార్కెట్ విలువను పోగొట్టుకొంది. తద్వారా ఇంత భారీ మొత్తం సంపద కోల్పోయిన తొలి లిస్టెడ్ కంపెనీగా చరిత్రకెక్కింది. అమెరికాలో ధరలు విపరీంగా పెరగడం, ఫెడ్ వడ్డీరేట్లు పెంచడం, ఆర్ధిక మాంద్యం భయాలు వెంటాడడంతో ఈ పరిణామం చోటుచేసుకున్నట్టు ఆర్ధిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కంపెనీ షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. జులై 2021లో కంపెనీ తన ఆల్ టైం రికార్డు స్థాయి విలువ 1.88 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోగా, ఈ నెల 9 నాటికి ఆ విలువ 87,900 కోట్ల డాలర్లకు పడిపోయింది. సంపద విలువ పడిపోవడంతో కంపెనీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. వేలాది మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ జారీ చేస్తోంది. రోబోటిక్ అనే విభాగాన్ని పూర్తిగా తొలగించగా, వేల మందిని తొలగించినట్టు సమాచారం. అటు మరో దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ కూడా దారుణ పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఈ కంపెనీ గడచిన ఏడాది కాలంలో 88,900 కోట్ల డాలర్ల మేర నష్టపోయింది. ఆదాయం పరంగా చూస్తే అమెరికాలోని టాప్ 5 కంపెనీలు ఒక్క ఏడాదిలో 4 లక్షల కోట్ల డాలర్ల మేర మార్కెట్ సంపదను కోల్పోయాయి. ఇందుకు రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కూడా తోడవడంతో భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.
భారీగా సంపద కోల్పోయిన అమెజాన్ !
الجمعة، 11 نوفمبر 2022
amzon business science technologe భారీగా సంపద కోల్పోయిన అమెజాన్ !
ليست هناك تعليقات:
إرسال تعليق