ఐఫోన్ హైఎండ్ ధర ఎంత ఉంటుంది? దాదాపు రూ. 2 లక్షలు. మోడల్‌ని బట్టి అంతకంటే తక్కువ ధరకే ఐఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ ఐఫోన్ మాత్రం ఒకటి కాదు. రెండు కాదు.. ఏకంగా రూ. 32 లక్షల ధరకు అమ్ముడుపోయింది. ఫ్యాక్టరీ సీల్డ్, ఫస్ట్ ఎడిషన్ ఐఫోన్ కావడంతో దానికి విపరీతమైన డిమాండ్ వచ్చింది. 2007లో ఐఫోన్ మార్కెట్‌లో విడుదలవగా, ఫస్ట్ ఎడిషన్ ఫోన్ ఒకదానిని ప్రస్తుతం వేలం వేశారు. దాని ధర 599 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు. అయితే, ఇది అనూహ్యంగా భారీ ధరకు అమ్ముడుపోయింది. వేలంలో ఏకంగా 39,339.60 డాలర్లు పలికింది. ఇది అసలు ధర కంటే దాదాపు 65 రెట్లు ఎక్కువ. ఫస్ట్ ఎడిషన్ ఐఫోన్‌లో ప్రత్యేక ఫీచర్లు ఏమీ లేవు. కేవలం 8GB స్టోరేజీ, 2MP కెమెరా మాత్రమే ఉంది. ఈ ఫోన్‌ను వేలంలో మొదట 2,500 డాలర్లు పాడారు. ఆ తరువాత 10,000 డాలర్లకు చేరింది. వేలం జరిగిన మొదటి రెండు రోజులు ధర మారలేదు. ఆ తరువాత జరిగిన 28 వేర్వేరు బిడ్‌లలో ఫోన్ ధర ఐదు అంకెలను మించిపోయింది. ఈ ఫోన్‌ను ఎవరూ వినియోగించలేదని నిర్ధారించడానికి అనేక సూచికలు కూడా ఉన్నాయి. పకడ్బందీ ప్యాకేజీతో, ఫ్యాక్టరీ సీల్ అన్నీ సక్రమంగా ఉన్నాయి. అయితే, ఆపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ 2007 జనవరి 9న మొట్టమొదటి ఐఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేశారు. సెల్‌ఫోన్ ప్రారంభించిన 5 నెలల తరువాత దాని క్రేజ్ భారీగా పెరిగింది. ఫస్ట్ జెనరేషన్ ఐఫోన్ గేమ్ ఛేంజర్ స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్‌లో వెలుగొందింది.
రూ. 32 లక్షలకు అమ్ముడైన 'ఐఫోన్' !
الخميس، 20 أكتوبر 2022
iphone science technologe దాని ధర 599 అమెరికన్ డాలర్లుగా నిర్ణయించారు ఫస్ట్ ఎడిషన్ ఫ్యాక్టరీ సీల్డ్ రూ. 32 లక్షలకు అమ్ముడైన 'ఐఫోన్' !
ليست هناك تعليقات:
إرسال تعليق