బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ బౌన్స్ తయారు చేసిన ఇన్ఫినిటీ స్కూటర్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కి ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సేల్‌లో భాగంగా బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కూడా ఫ్లిప్‌కార్ట్ అమ్ముతోంది. ఇన్ఫినిటీ e.1 మోడల్ సేల్ జూలై 22 మధ్యాహ్నం ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభమైయింది. ఎలక్ట్రిక్ స్కూటర్ ఆర్డర్ చేసిన 15 రోజుల్లో డెలివరీ అవుతుంది. తెలంగాణ, కర్నాటక, న్యూఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన కస్టమర్లు బౌన్స్ ఇన్ఫినిటీ ఇ-స్కూటర్ ఆర్డర్ చేయొచ్చు. బౌన్స్ ఇన్ఫినిటీ e.1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.74,499 నుంచి ప్రారంభం అవుతుంది. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, పూణె, అహ్మదాబాద్, బెంగళూరులో అందుబాటులో ఉంటుంది. ఢిల్లీ కస్టమర్లకు రూ.9,500 స్టేట్ సబ్సిడీ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో రూ.65,499 ధరకే కొనొచ్చు. గుజరాత్ కస్టమర్లకు రూ.19,000 స్టేట్ సబ్సిడీ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో రూ.55,999 ధరకే కొనొచ్చు. కర్నాటక, తెలంగాణ కస్టమర్లు రూ.74,999 చెల్లించాలి. మహారాష్ట్ర కస్టమర్లు రూ.65,499 ధరకే కొనొచ్చు. లిమిటెడ్ స్టాక్ మాత్రమే అందుబాటులో ఉంది. ఐదు కలర్స్‌లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. స్పార్కిల్ బ్లాక్, కామెట్ గ్రే, స్పోర్టీ రెడ్, పెరల్ వైట్, డిసాట్ సిల్వర్ కలర్స్‌లో కొనొచ్చు. హెల్మెట్ స్టోరేజ్, డిజిటల్ డిస్‌ప్లే లాంటి ఫీచర్స్ ఉన్నాయి. డిస్‌ప్లేలో ఇగ్నిషన్ స్టేటస్, ఇండికేటర్ స్టేటస్, బ్యాటరీ స్టేటస్, స్పీడ్ డిస్‌ప్లే లాంటి వివరాలన్నీ కనిపిస్తాయి. బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్‌కు రిజిస్ట్రేషన్, ఇన్స్యూరెన్స్ తప్పనిసరి. గంటకు 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో ప్రయాణించవచ్చు. స్మార్ట్ కంపానియన్ యాప్ అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ద్వారా బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్‌ను కంట్రోల్ చేయొచ్చు. డ్రాగ్, రివర్స్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి.  బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్‌లో ఇన్‌బిల్ట్ ట్రాకింగ్ ఫీచర్ ఉంది. యాప్ ద్వారా స్కూటర్‌ను ట్రాక్ చేయొచ్చు. ఇందులో 1.9KWhr బ్యాటరీ ఉంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. ఇందులోని బ్యాటరీలు ఈజీగా రీప్లేస్ చేయొచ్చు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ