పీడీఎఫ్ డాక్యుమెంట్లకు ఫోన్‌లోనే పాస్‌వర్డ్‌ !

الثلاثاء، 5 يوليو 2022

iLovePDF యాప్‌ PDF science smart phones technologe పీడీఎఫ్ డాక్యుమెంట్లకు ఫోన్‌లోనే పాస్‌వర్డ్‌ !

t f B! P L


పీడీఎఫ్ డాక్యుమెంట్‌లను స్నేహితులతో పాటుగా ఆఫీసుకు సంబందించిన కార్యకలాపాలను నిర్వహించి దాని సమాచారాన్ని మరొకరికి పంపడానికి ఉపయోగిస్తారు. పీడీఎఫ్ ఫార్మాట్ లేదా పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ రూపంలో ప్రొఫెషనల్ డాక్యుమెంట్‌లు లేదా ఫైల్‌లను ఇంటర్నెట్‌లో పంపడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే దీనిని బంచ్‌లో అత్యంత సురక్షితమైన ఫార్మాట్‌లలో ఒకటైనా పాస్‌వర్డ్ సహాయంతో మరింతగా ఎన్‌క్రిప్ట్ చేయవచ్చు. పాస్‌వర్డ్-ప్రొటెక్ట్ పీడీఎఫ్ అనేది మరింత సురక్షితమైనది. ఆన్‌లైన్‌లో సున్నితమైన లేదా ప్రొఫెషనల్ ఫైల్‌లను పంపడానికి మీకు ఇది ఉత్తమ ఎంపిక కావచ్చు. ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించని వారు ఉండరు. ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క అన్ని కార్యకలాపాల కోసం స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగిస్తున్నారు. 

ఫోన్‌లో పీడీఎఫ్ డాక్యుమెంట్లను పాస్‌వర్డ్‌తో ఎన్‌క్రిప్ట్ చేసే విధానం : పీడీఎఫ్ డాక్యుమెంట్‌ని పాస్‌వర్డ్‌తో ఎన్‌క్రిప్ట్ చేయడం అనేది చాలా సులభం. దీని కోసం మీకు కావలసిందల్లా ఒక యాప్ మాత్రమే. తరువాత మీరు యాప్‌లో కింద తెలిపే దశలను అనుసరించాల్సి ఉంటుంది. ముందుగా మీ ఆండ్రాయిడ్ లేదా iOS స్మార్ట్‌ఫోన్‌లో 'iLovePDF' అనే యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి. iLovePDF యాప్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి దిగువ భాగంలో ఉన్న 'టూల్స్' ట్యాబ్‌పై నొక్కండి. ఇప్పుడు మీరు అందుబాటులో ఉన్న ఎంపికల జాబితాను చూస్తారు. ఇక్కడ 'ప్రొటెక్ట్ పీడీఎఫ్' ఎంపిక కోసం చూడండి మరియు దానిపై నొక్కండి.  పాస్‌వర్డ్‌తో రక్షించాలనుకునే పీడీఎఫ్ డాక్యుమెంట్‌ని ఎంచుకుని 'కొనసాగించు' ఎంపికపై క్లిక్ చేయండి. తరువాత మీ యొక్క పాస్‌వర్డ్‌ని నమోదు చేసి దిగువన దాన్ని మళ్లీ నిర్ధారించి 'ప్రొటెక్ట్' ఎంపికపై నొక్కండి. ఇలా చేయడంతో మీ పీడీఎఫ్  డాక్యుమెంట్ పాస్‌వర్డ్‌తో లాక్ చేయబడుతుంది. మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో పీడీఎఫ్ డాక్యుమెంట్‌కు పాస్‌వర్డ్‌ను జతచేసి ఎంత సులభంగా రక్షించవచ్చు లేదా లాక్ చేయవచ్చు. PDFని రోజుకు మూడుసార్లు మాత్రమే లాక్ చేయడానికి యాప్ మిమ్మల్ని అనుమతిస్తుంది అని గమనించండి. మీరు పాస్‌వర్డ్‌ను ఎన్‌క్రిప్ట్ చేసే డాక్యుమెంట్‌లను అధికంగా కలిగి ఉంటే కనుక మీరు దానిని మరుసటి రోజు ప్రయత్నించవచ్చు లేదా యాప్ ప్రీమియం ప్లాన్‌ని కొనుగోలు చేయవచ్చు.

ఫోన్‌లో పీడీఎఫ్ డాక్యుమెంట్‌లను అన్‌లాక్ చేసే విధానం :  క్రీయేట్ చేసిన పీడీఎఫ్ 

 పాస్‌వర్డ్‌ను మరచిపోయినట్లయితే కనుక మీరు టూల్స్ విభాగానికి వెళ్లి 'అన్‌లాక్ పీడీఎఫ్' ఎంపిక కోసం వెతకవచ్చు. దానిని ఎంచుకొని పీడీఎఫ్ డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేసి 'PDFని అన్‌లాక్ చేయండి' ఎంపికపై నొక్కండి. ఇలా చేయడంతో మీరు PDF డాక్యుమెంట్‌ని విజయవంతంగా అన్‌లాక్ చేయవచ్చు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ