రిలయన్స్ డిజిటల్ 100GB ఉచిత డేటాతో కొత్త హెచ్ పి స్మార్ట్ సిమ్ల్యాప్‌టాప్‌ను ప్రకటించింది. HP స్మార్ట్ సిమ్ లైఫ్ అనేది ఫస్ట్ టైప్ స్మార్ట్ LTE ల్యాప్‌టాప్ అందిస్తోంది. అర్హత కలిగిన యూజర్లకు HP స్మార్ట్ సిమ్‌తో కాంప్లిమెంటరీ కింద రిలయన్స్ డిజిటల్ ఆఫర్ చేస్తోంది. 100GB డేటాతో Jio డిజిటల్ లైఫ్ బెనిఫిట్స్ యూజర్లకు అందిస్తోంది. మరో మాటలో చెప్పాలంటే.. మీరు HP నుంచి స్మార్ట్ LTE ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేస్తే.. మీరు 100GB ఉచిత డేటాను పొందవచ్చు. ఈ ఆఫర్‌ను పొందేందుకు యూజర్లు Jio HP స్మార్ట్ సిమ్ అవసరమని గమనించాలి. అయితే ఈ కొత్త ఆఫర్ అందరి యూజర్లకు అందుబాటులో లేదు. ఎంపిక చేసిన HP ల్యాప్‌టాప్‌ల కొత్త కస్టమర్‌లకు మాత్రమే 100GB ఉచిత డేటా ఆఫర్ వర్తిస్తుంది. మీరు 100 GB ఉచితంగా పొందాలంటే రిలయన్స్ డిజిటల్ అందించే ఆఫర్‌కు అర్హత పొందాల్సి ఉంటుంది. కొత్త HP యూజర్లకు HP LTE ల్యాప్‌టాప్‌తో కొత్త Jio SIMకి సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు. ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా 365 రోజుల (రూ.1500 విలువ) 100 GB డేటాను పొందవచ్చు. మీరు HP అర్హత కలిగిన ల్యాప్‌టాప్‌లను మాత్రమే ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం.. యూజర్లు కొనుగోలు చేసే రెండు అర్హత కలిగిన మోడల్‌లు అందుబాటులో ఉన్నాయి. HP 14ef1003tu, HP 14ef1002tu వంటివి ఉన్నాయి. మీరు అర్హత కలిగిన డివైజ్ కొనుగోలు చేస్తే.. మీరు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా కొత్త Jio SIMని పొందవచ్చు. రూ. 1500 విలువైన డేటాను ఏడాదికి 100 GB వరకు ఉచితంగా అందిస్తుంది. 100 GB డేటా ముగిసిన తర్వాత.. ఇంటర్నెట్ స్పీడ్ 64 Kbps వరకు తగ్గిపోతుంది. యూజర్లు అదనపు హై స్పీడ్ 4G డేటా కోసం MyJio లేదా Jio.com లో డేటా ప్యాక్‌లు / ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవచ్చు. హై స్పీడ్ ఇంటర్నెట్ పొందవచ్చు.
రిలయన్స్ నుంచి హెచ్ పి స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్ !
السبت، 16 يوليو 2022
100GB ఉచిత డేటా jio science technologe రిలయన్స్ నుంచి హెచ్ పి స్మార్ట్ సిమ్ ల్యాప్‌టాప్
ليست هناك تعليقات:
إرسال تعليق