నుబియా జెడ్40ఎస్ ప్రో చైనాలో లాంచ్ అయింది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. గతంలో లాంచ్ అయిన నుబియా జెడ్40 ప్రోకి తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. కెమెరా ఓరియంటెడ్ స్మార్ట్ ఫోన్. ఫొటోలు, వీడియోల కోసం ఇందులో అలెర్ట్ స్లైడర్ కూడా ఉంది. ఈ ఫోన్ ధర 3,399 యువాన్ల నుంచి (సుమారు రూ.40,000) ప్రారంభం కానుంది. మ్యాజిక్ గ్రీన్, నైట్ సీ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. మనదేశంలో నుబియా జెడ్40ఎస్ ప్రో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు. ఇందులో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గానూ, టచ్ శాంప్లింగ్ రేట్ 480 హెర్ట్జ్‌గానూ ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 18 జీబీ వరకు ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్787 ప్రాసెసర్‌ను అందించారు. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 8 మెగాపిక్సెల్ టెలిఫొటో సెన్సార్ కూడా ఉన్నాయి. ముందువైపు ఉన్న 16 మెగాపిక్సెల్ కెమెరాతో సెల్ఫీలు తీసుకోవచ్చు.  బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 80W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. 120W ఫాస్ట్ చార్జింగ్ ఉన్న వేరియంట్లో 4600 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత మైఓఎస్ 12 స్కిన్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని మందం 0.8 సెంటీమీటర్లు కాగా, బరువు 205 గ్రాములుగా ఉంది.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ