టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల !

الجمعة، 17 يونيو 2022

automobile ebike electric scooter science technologe టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల విడుదల !

t f B! P L


టీవీఎస్ మోటార్ కంపెనీ ఇటీవల 2022 ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను రిలీజ్ చేసింది. టీవీఎస్ ఐక్యూబ్, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ , టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ మోడల్స్‌ని పరిచయం చేసింది. టాప్ ఎండ్ స్కూటర్‌ని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు )దాదాపు 150 కి.మీ.) ఛార్జింగ్ అవసరం లేకుండా వెళ్లొచ్చు. టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ ప్రారంభ ధర రూ.98,564 కాగా, టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ స్కూటర్ ప్రారంభ ధర రూ.1,08,690. ఢిల్లీలో ఫేమ్ సబ్సిడీతో కలిపి ధర ఇది. వేర్వేరు రాష్ట్రాల్లో ధర వేర్వేరుగా ఉంటుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ స్కూటర్ ధర రూ.1,28,000 ఉండొచ్చని అంచనా. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్ కొనసాగుతోంది. రెండేళ్ల క్రితం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియాలో లాంఛ్ చేసింది. తమ స్కూటర్లు భారతీయ రోడ్లపై మూడు కోట్ల కిలోమీటర్లు ప్రయాణించాయని కంపెనీ చెబుతోంది. ఇప్పుడు టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంఛ్ చేసింది. ఛాయిస్, కంఫర్ట్, సింప్లిసిటీ లాంటి అంశాలకు ప్రాముఖ్యతనిస్తూ ఈ మోడల్స్‌ని  కంపెనీ రూపొందించింది. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్‌టీ మోడల్ హైఎండ్ వేరియంట్. ఇందులో కూడా 7 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్ ఉంటుంది. ఫైవ్ వే జాయ్‌స్టిక్, మ్యూజిక్ కంట్రోల్, థీమ్ పర్సనలైజేషన్, ప్రొయాక్టీవ్ నోటిఫికేషన్స్, వెహికిల్ హెల్త్ లాంటి ఫీచర్స్‌తో పాటు 4జీ టెలీమ్యాటిక్స్, ఓటీఏ అప్‌డేట్స్, ఇన్ఫినైట్ థీమ్ పర్సనలైజేషన్, వాయిస్ అసిస్ట్, టీవీఎస్ ఐక్యూప్ అలెక్సీ స్కిల్‌సెట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఐక్యూబ్ ఎస్‌టీ మోడల్‌ను నాలుగు కలర్స్‌లో కొనొచ్చు. సీటు కింద రెండు హెల్మెట్స్ స్టోర్ చేయొచ్చు. 32లీటర్ల వరకు స్టోరేజ్ చేయొచ్చు. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 145 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గంటకు 82 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. 950వాట్ ఛార్జర్‌తో మూడు గంటల్లో, 650వాట్ ఛార్జర్‌తో నాలుగున్నర గంటల్లో ఛార్జింగ్ చేయొచ్చు. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ మిడ్ రేంజ్ వేరియంట్. 7 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్ ఉంటుంది. ఫైవ్ వే జాయ్‌స్టిక్, మ్యూజిక్ కంట్రోల్, థీమ్ పర్సనలైజేషన్, ప్రొయాక్టీవ్ నోటిఫికేషన్స్, వెహికిల్ హెల్త్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. నాలుగు కలర్స్‌లో కొనొచ్చు. ఇందులో 3.4 kWh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గంటకు 78 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. 950వాట్ ఛార్జర్‌తో మూడు గంటల్లో, 650వాట్ ఛార్జర్‌తో నాలుగున్నర గంటల్లో ఛార్జింగ్ చేయొచ్చు. టీవీఎస్ ఐక్యూబ్ 2022 బేస్ వేరియంట్. 5 అంగుళాల టీఎఫ్‌టీ స్క్రీన్ ఉంటుంది. మూడు కలర్స్‌లో కొనొచ్చు. ఇందులో 3.4 kWh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. గంటకు 78 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.

Random Post

    إجمالي مرات مشاهدة الصفحة

    بحث هذه المدونة الإلكترونية

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    نموذج الاتصال

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ