రిలయన్స్ జియో మరియు గూగుల్ భాగస్వామ్యంతో వచ్చిన జియోఫోన్ నెక్స్ట్ 4G ఫోన్ అమెజాన్ నుండి 2,500 భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. అంతేకాదు, జియో అధికారిక వెబ్సైట్ నుండి కూడా ఈ స్మార్ట్ ఫోన్ భారీ ఎక్స్ చేంజ్ ఆఫర్ లభిస్తోంది. ఎక్స్ చేంజ్ అఫర్ క్రింద జియో ఈ స్మార్ట్ ఫోన్ ను భారీ డిస్కౌంట్ తో జియో వెబ్సైట్ ద్వారా అఫర్ చేస్తోంది. ప్రస్తుతం అమెజాన్ 39% డిస్కౌంట్ తో కేవలం రూ.4,460 రూపాయల అఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఈ ఫోన్ పైన బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందించింది. ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 1,250 రూపాయల తక్షణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. జియో వెబ్సైట్ ద్వారా అందిస్తున్న అఫర్ విషయానికి వస్తే, ఈ ఫోన్ ను ఏదైనా 4G ఫోన్ తో ఎక్స్ చేంజ్ చేస్తే, జియోఫోన్ నెక్స్ట్ కేవలం రూ.4,499 రూపాయలకే లభిస్తుంది. అంతేకాదు, నెలవారీ ఇఎంఐ పద్దతిలో ఎంచుకుంటే ముందుగా కేవలం రూ.1,999 రూపాయలు చెల్లించి ఈ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు మరియు మిగిలిన డబ్బును 18 లేదా 24 నెలల వాయిదాల్లో ఈజీ ఇఎంఐ ద్వారా కూడా చెల్లించవచ్చు. జియోఫోన్ నెక్స్ట్ 5.45-అంగుళాల HD(720x1440) డిస్ప్లే కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది. ఈ ఫోన్ 1.3 GHz క్లాక్ స్పీడ్ అందించగల Qualcomm QM215 చిప్సెట్తో పనిచేస్తుంది. అలాగే, ఈ ఫోన్ LPDDR3 2GB ర్యామ్ మరియు 32GB ఇన్ బిల్ట్ స్టోరేజ్ కలిగివుంటుంది. అలాగే, మైక్రో SD ద్వారా 512GB మెమోరిని విస్తరించవచ్చు. ఫోన్ లో వెనుక 13MP సింగల్ కెమెరా మరియు ముందు సెల్ఫీల కోసం 8MP సెల్ఫీ కెమెరాలను అందించింది. ఈ కెమెరా HDR Mode, Night Mode, Portrait వంటి మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ ఫోన్ లో 3000mAh బ్యాటరీని సాధారణ ఛార్జింగ్ టెక్నాలజీతో ఇచ్చింది.
భారీ డిస్కౌంట్ తో జియో ఫోన్ నెక్స్ట్ !
الاثنين، 20 يونيو 2022
jio science technologe జియో మరియు గూగుల్ భాగస్వామ్యం భారీ డిస్కౌంట్ తో జియో ఫోన్ నెక్స్ట్ ! భారీ డిస్కౌంట్ తో జియో వెబ్సైట్ ద్వారా అఫర్
ليست هناك تعليقات:
إرسال تعليق