నైక్ కంపెనీ బ్లూటూత్ సదుపాయంతో స్మార్ట్ షూలను విడుదల చేసింది. ఈ షూ స్మార్ట్ అండ్ పూర్తిగా ఆటోమేటిక్. ఈ బ్లూటూత్ షూ రోబోట్ లాగా లేస్‌ని కట్టివేస్తుంది. దీని పేరు అడాప్ట్ బిబి. లుక్స్ పరంగా చూస్తే బాస్కెట్‌బాల్ షూలా ఉంటుంది. ఇవి వేసుకున్న వెంటనే అటోమేటిక్‌గా లేస్‌లు కట్టుకోవడం దీని ప్రత్యేకత. ఇందులో ఇంకో ప్రత్యేక ఉంది. బ్లడ్ ప్రేజర్ కూడా తెలియజేస్తుంది. మీరు ఈ షూలాను ధరించినప్పుడు మీ పాదాలు వాపు ఉన్నట్లయితే అందుకు అనుగుణంగా రక్త ప్రసరణ చేసేలా సహాయపడతాయి. ఆటోమేటిక్‌గా సర్దుబాటు అవుతాయి. పాదాలకు బిగుసుపోకుండా వదులుగా మారుతుంటాయి. ఈ షూలను యాప్ ద్వారా కూడా కంట్రోల్ చేయవచ్చు. ఇంతకుముందు నైక్ బ్రాండ్ నైక్ + ఐపాడ్ అండ్ నైక్ + ట్రైనింగ్ వంటి స్మార్ట్ షూలను ప్రవేశపెట్టింది. భారతదేశంలో Nike Adapt BB విడుదల గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే షూ ధరించే ముందు పాదాలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా సర్దుబాటు చేసుకునేలా వీటిని రూపొందించినట్లు తెలుస్తోంది. పాదాలకు ఏదైనా నొప్పి ఉన్నా షూల ఎఫెక్ట్ లేకుండా ఉంటుందని తెలుస్తోంది.
ఆటోమేటిక్‌గా లెస్‌లను కట్టే స్మార్ట్ షూ
الثلاثاء، 10 مايو 2022
Nike Nike Adapt BB science technologe ఆటోమేటిక్‌గా లెస్‌లను కట్టే స్మార్ట్ షూ ఈ షూ స్మార్ట్ అండ్ పూర్తిగా ఆటోమేటిక్
ليست هناك تعليقات:
إرسال تعليق