వొడాఫోన్, ఐడియా టెలికాం సంస్థలు ఇటీవలే రూ. 98, రూ.195, రూ.319 పేరుతో పలు ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పలు ప్రయోజనాలతో కూడిన మరో సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చాయి. కేవలం రూ.82 ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్‌తో 28 రోజులపాటు ఉచితంగా సోనీలివ్ ప్రీమియం సబ్ స్క్రిప్షన్‌ను పొందేలా ఆఫర్‌ను ప్రకటించాయి. "ఇది యాడాన్ ప్యాక్. ఈ మొత్తంతో రీచార్జ్ చేసుకుంటే వచ్చే అదనపు ప్రయోజనం 4 జీబీ డేటా. దీని వ్యాలిడిటీ 14 రోజులు. ఇందులో ఎటువంటి వాయిస్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు. యూజర్లు స్పోర్ట్ స్ట్రీమ్స్ అయిన యూఈఎఫ్ఏ చాంపియన్స్ లీగ్, డబ్ల్యూడబ్ల్యూఈ తదితర వాటిని వీక్షించొచ్చు. సోనీ లివ్ సబ్ స్క్రిప్షన్ అన్నది కేవలం మొబైల్కే పరిమితం. ఇతర సాధనాల ద్వారా వీక్షించడానికి కుదరదు. అంటే ల్యాప్‌ట్యాప్, కంప్యూటర్లు సిస్టమ్‌లో వాడుకోవడానికి ఉండదు".
రూ.82కే వొడాఫోన్ సరికొత్త ప్లాన్ !
الثلاثاء، 10 مايو 2022
internet science technologe vi ఇతర సాధనాల ద్వారా వీక్షించడానికి కుదరదు ఇది యాడాన్ ప్యాక్ రూ.82కే వొడాఫోన్ సరికొత్త ప్లాన్
ليست هناك تعليقات:
إرسال تعليق