ఫ్లిప్ కార్ట్ లో మోటో జీ 52పై 1,000 రూపాయల డిస్కౌంట్

Monday, May 2, 2022

000 రూపాయల డిస్కౌంట్ flipkart moto science smart phone technologe ఫ్లిప్ కార్ట్ లో మోటో జీ 52పై 1

t f B! P L


మోటరోలా ఇండియన్ మార్కెట్లో సరికొత్తగా ప్రవేశపెట్టిన మోటో జీ 52 స్మార్ట్ ఫోన్ మొదటిసారిగా సేల్ కి రానుంది. రేపటి నుండి మొదలవనున్న ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకానికి వస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ పైన 1,000 రూపాయల డిస్కౌంట్ అందించే బ్యాంక్ అఫర్ ను కూడా ,మోటరోలా అందించింది. ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో pOLED డిస్ప్లే, క్వాడ్ ఫంక్షన్ రియర్ కెమెరా , బిగ్ బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. మోటో జి52 స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ.14,499 ప్రారంభ ధరతో వచ్చింది. ఇది 4GB మరియు 64GB మోడల్ కోసం నిర్ణయించిన ధర. 6GB మరియు 128GB మోడల్ ధర రూ.15,499. పరిచయ ఆఫర్లో భాగంగా, HDFC క్రెడిట్ కార్డ్ లేదా EMI ట్రాన్సాక్షన్ తో రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. ఈ ఫోన్ మే 3 నుండి Flipkart మరియు ఇతర అవుట్ లెట్స్ ద్వారా అమ్మకానికి వస్తుంది. రిలయన్స్ జియో నుండి ఈ ఫోన్ పైన రూ.2,549 విలువైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మోటో జి52 స్మార్ట్ ఫోన్ 6.6 అంగుళాల FHD+ రిజల్యూషన్ డిస్ప్లేని 90Hz రిఫ్రెష్ రేట్ తో కలిగివుంది. ఈ ఫోన్ నేచురల్ కలర్స్ అందించగల pOLED డిస్ప్లేని కలిగివుంది మరియు ఈ డిస్ప్లే పైన మధ్యలో పంచ్ హోల్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 680 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో వస్తుంది. దీనికి జతగా 6GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. అలాగే, మోటో జి52 యాడ్-ఫ్రీ Android 12 OS పైన నడుస్తుంది. డేడికేటెడ్ మైక్రో SD కార్డ్ తో మెమొరీని విస్తరించవచ్చు. ఈ ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ ఫిక్షన్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో 50MP ప్రధాన కెమెరాకి జతగా 8MP అల్ట్రా వైడ్ సెన్సార్, 2MP మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి మరియు ఇది మూడు కెమెరాలతోనే నాలుగు కెమెరాల పనిచేస్తుంది. ఇక సెల్ఫీల కోసం ముందుభాగంలో వున్నా సెంటర్ పంచ్ హోల్ కటౌట్ లో 16ఎంపి సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 33W టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 5,000 mAh బిగ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ డ్యూయల్ నానో-సిమ్, USB-C సాకెట్,ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 తో ఉంటుంది. ఈ ఫోన్ Dolby Atmos సపోర్ట్ కలిగిన స్టీరియో స్పీకర్లతో కూడా వస్తుంది.

Random Post

    Total Pageviews

    Search This Blog

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ