అపోలో 11 మిషన్‌లో 53 ఏళ్ల క్రితం నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టి తాజాగా జరిగిన వేలంలో భారీ ధర పలికింది. అంతర్జాతీయ ఆక్షన్ సంస్థ బొన్‌హామ్స్ నిర్వహించిన వేలంలో చిటికెడు చంద్రుడి మట్టిని ఓ వ్యక్తి సుమారు 3.85 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశాడు. అయితే తాము అనుకున్న రేటు రాలేదని సంస్థ భావిస్తోంది. వేలానికి ముందు దీనికి దాదాపు 12 లక్షల డాలర్లు పలుకుతుందని అంచనా వేసింది. అపోలో మిషన్ నుంచి తెచ్చిన శాంపిళ్ల వేలానికి ఇంతవరకు నాసా అభ్యంతరాలు చెబుతూ వచ్చింది. అయితే 2017లో కోర్టు ఆదేశాల మేరకు నాసా తన అభ్యంతరాలను విరమించుకుంది.
చంద్రుడి మట్టికి రూ. 3.85 కోట్లు !
الثلاثاء، 19 أبريل 2022
nasa science technologe చంద్రుడి మట్టికి రూ. 3.85 కోట్లు ! వేలంలో భారీ ధర పలికింది
ليست هناك تعليقات:
إرسال تعليق