ప్రముఖ భారతీయ మొబైల్ తయారీ సంస్థ లావా మార్కెట్లోకి కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టింది. Lava X2 పేరుతో ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ పెద్ద స్క్రీన్, పెద్ద బ్యాటరీ మరియు డ్యూయల్ రియర్ కెమెరా వంటి మరిన్ని ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగివుంది. బడ్జెట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని వారికి అవసరమైన స్పెక్స్ తో ఈ ఫోన్ ను అందించింది. అమెజాన్ ఇండియా నుండి Lava X2 స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం Pre-Booking కోసం అంధుబాటులో వుంది మరియు మార్చ్ 11వ తేదీ లోపుగా బుక్ చేసుకునే వారికి రూ.6,599 రూపాయల అఫర్ ధరకే లభిస్తుంది. అఫర్ ముగిసిన తర్వాత ఈ ఫోన్ రూ.6,999 ధరతో రిటైల్ చేయబడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లావా ఇ-స్టోర్ ద్వారా కూడా రీటైలింగ్ చేయబడుతుంది. లావా ఎక్స్2 స్మార్ట్ ఫోన్ పెద్ద 6.5 ఇంచ్ HD+ రిజల్యూషన్ డిస్ ప్లేని కలిగివుంది. ఈ డిస్ ప్లే వాటర్ డ్రాప్ నోచ్ డిజైన్ తో వస్తుంది. ఈ ఫోన్ మీడియాటెక్ ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. అయితే, ప్రోసెసర్ పేరును మాత్రం వెల్లడించలేదు. ఈ ఆక్టా కోర్ ప్రోసెసర్ జతగా 2GB ర్యామ్ తో వస్తుంది మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజ్ వుంది. ఫోన్ వెనుక 8MP మైన్ సెన్సార్ కలిగిన డ్యూయల్ కెమెరా సెటప్ కలిగివుంది. ఈ ఫోన్ AI-ఆధారిత మెరుగుదలలతో వస్తుంది. ముందు భాగంలో, సెల్ఫీల కోసం 5MP సెల్ఫీ కెమెరాను కలిగివుంది. ఈ లావా ఫోన్ పెద్ద 5000mAh బ్యాటరీ మరియు సాధారణ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఇతర కనెక్టివిటీ ఎంపికలు విషయానికి వస్తే, WiFi, బ్లూటూత్ 5.0, డ్యూయల్ 4G SIM సపోర్ట్, 3.5 mm హెడ్ఫోన్ జాక్ మరియు OTG సపోర్ట్ ఉన్నాయి.
బడ్జెట్ ధరలో లావా ఎక్స్ 2 విడుదల
الجمعة، 4 مارس 2022
science smart phone technologe పెద్ద బ్యాటరీ మరియు డ్యూయల్ రియర్ కెమెరా పెద్ద స్క్రీన్ బడ్జెట్ ధరలో లావా ఎక్స్ 2 విడుదల
ليست هناك تعليقات:
إرسال تعليق