షియోమి రెడ్‌మి ఈనెల 30న భారత్‌లో రెడ్‌మి నోట్ 11టీ 5జీ లాంఛ్ చేస్తున్న క్రమంలో అదేరోజు రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్ ప్రొ లాంఛ్ వివరాలు ప్రకటించవచ్చని భావిస్తున్నారు. చైనాలో గత నెలలో ఫిట్‌నెస్ ట్రాకర్‌ను లాంఛ్ చేసిన రెడ్‌మి త్వరలో భారత్‌లో దీన్ని లాంఛ్ చేయవచ్చని తాజా లీక్‌లు వెల్లడించాయి. బిఐఎస్ లిస్టింగ్‌లో రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్ ప్రొ కనిపించడం ఈ లీకులకు మరింత ఊతమిస్తోంది. రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్ ప్రొ సిలికాన్ స్ట్రాప్స్‌తో రెక్టాంగ్యులర్ బాడీతో ఉంటుంది. ఈ పరికరం 1.47 ఇంచ్ అమోల్డ్ డిస్‌ప్లేతో 24×7 హార్ట్ రేట్ ట్రాకింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ మానిటరింగ్, స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటోంది. భారత్‌లో ఒరిజినల్ రెడ్‌మి బ్యా్ండ్ ప్రొ రూ 1599కు లాంఛ్ కావడంతో రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్ ప్రొ ధర మరికొంత అధికంగా ఉండే అవకాశం ఉంది.
త్వరలో రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్ ప్రొ లాంచ్ !
الثلاثاء، 16 نوفمبر 2021
Redmi science technologe త్వరలో రెడ్‌మి స్మార్ట్ బ్యాండ్ ప్రొ లాంచ్ !
ليست هناك تعليقات:
إرسال تعليق